తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  గర్బిణీ మృతి.. నిర్లక్ష్యమంటూ కేసు నమోదు.. మనస్థాపంతో వైద్యురాలు కూడా…

గర్బిణీ మృతి.. నిర్లక్ష్యమంటూ కేసు నమోదు.. మనస్థాపంతో వైద్యురాలు కూడా…

HT Telugu Desk HT Telugu

31 March 2022, 10:38 IST

google News
    • రాజస్థాన్ లో డాక్టర్ అర్చన శర్మ అనే ప్రైవేటు వైద్యురాలు సూసైడ్ చేసుకుంది. విధుల్లో నిర్లక్ష్యం కారణంగా గర్బిణీ మృతి చెందటంతో ఈమెపై కేసు నమోదైంది. దీంతో మనస్థాపానికి గురైన అర్చన శర్మ కూడా ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపింది. ఈ ఘటనపై వైద్యులు ఆందోళనకు దిగారు.
వైద్యురాలి సూసైడ్
వైద్యురాలి సూసైడ్ (ANI)

వైద్యురాలి సూసైడ్

రాజస్థాన్ లోని దౌస్తా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ వైద్యురాలు గర్భిణీకి శస్త్ర చికిత్స చేస్తుండగా... ఆమె మృతి చెందింది. అయితే వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగానే మహిళ మృతి చెందిందని ... కుటుంబసభ్యులు ఆరోపించారు. సంబంధిత వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫలితంగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వైద్యురాలు సూసైడ్...

అయితే ఈ పరిణామాలను తట్టుకోలేని ఆ వైద్యురాలు... తీవ్రంగా మనస్థాపానికి గురైంది. ఆస్పత్రి పైకి వెళ్లి ఉరేసుకుని మంగళవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఘటనాస్థలిలో సూసైడ్ నోట్ దొరికింది. అమాయక డాక్టర్లను వేధించడం మానుకోవాలని ఆమె రాసుకొచ్చారు.

వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడటంపై జిల్లా వ్యాప్తంగా వైద్యులు ఆందోళనకు దిగారు. బుధవారం పలు వైద్య సేవలను నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరిపించి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని 'ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెండ్ డాక్టర్స్ '(FORDA) ఆ రాష్ట్ర సీఎంకు లేఖ రాసింది. వైద్యురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. భవిష్యత్తుల్లో ఇలాంటి ఘటన జరగకుండా చూడాలని కోరింది. న్యాయం జరిగే వరకు పోరాటం జరుగుతుందని లేఖలో ప్రస్తావించింది.

ఈ ఘటనపై రాజస్థాన్ వైద్యారోగ్యశాఖ మంత్రి ప్రసాది లాల్ మీనా స్పందించారు. సెక్షన్ 302 కింద వైద్యురాలిపై కేసు నమోదు చేయలేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ విచారం వ్యక్తం చేశారు.

టాపిక్

తదుపరి వ్యాసం