తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gujarat Rains : ఈ రోడ్డుకు.. నెల రోజుల్లోనే నూరేళ్లు నిండిపోయాయి!

Gujarat rains : ఈ రోడ్డుకు.. నెల రోజుల్లోనే నూరేళ్లు నిండిపోయాయి!

Sharath Chitturi HT Telugu

18 July 2022, 18:54 IST

    • Gujarat rains : గుజరాత్​ వర్షాల నేపథ్యంలో ఓ వీడియో వైరల్​గా మారింది. నెల రోజులు ముందు నిర్మించిన ఓ రోడ్డు.. వర్షాల కారణంగా ధ్వంసమైంది.
ఈ రోడ్డుకు.. నెల రోజుల్లోనే నూరేళ్లు నిండిపోయాయి!
ఈ రోడ్డుకు.. నెల రోజుల్లోనే నూరేళ్లు నిండిపోయాయి!

ఈ రోడ్డుకు.. నెల రోజుల్లోనే నూరేళ్లు నిండిపోయాయి!

Gujarat rains : వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ప్రజలు భయపడిపోతూ ఉంటారు. ఒకపక్క కరెంట్​ కోతలు.. మరోపక్క బెంబేలెత్తించే వరద నీరు. వీటి మధ్య ప్రయాణం చేయాలన్నా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లు దారుణ స్థితిలో ఉంటాయి. కొన్నింటికి గుంతలు పడుతూ ఉంటాయి. కానీ గుజరాత్​లో నిర్మించిన ఓ రోడ్డు.. ఏకంగా ఒక్కసారిగా లోపలికి కూరుకుపోయింది. దాని ఆయుష్షు కేవలం నెల రోజులే!

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

నెల రోజులకే ఇలా..

గుజరాత్​లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ఇక రోడ్ల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు! ఈ తరుణంలో ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

అహ్మదాబాద్​లోని ఓ రోడ్డు.. గుజరాత్​ వర్షాలకు లోపలికి కూరుకుపోయింది. అక్కడే ఉన్న ప్రజలు ఆ లైవ్​ వీడియోను చిత్రీకరించారు. తొలుత రోడ్డుకు పగుళ్లు వచ్చాయి. ఆ వెంటనే రోడ్డు లోపలికి కుప్పకూలిపోయింది. కాగా.. ఆ రోడ్డును నెల రోజుల ముందే వేసినట్టు తెలుస్తోంది.

‘ప్రతి ఏడాది.. వర్షాకాలంలో ఇది సాధారణమైన విషయమే’ అని ఓ వ్యక్తి.. ఆ వీడియోను ట్వీట్​ చేశాడు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రభుత్వ యంత్రాంగంపై మండిపడుతున్నారు. నెల రోజుల్లో రోడ్డు ఇలా మారడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఈ ఏడాది చివర్లో గుజరాత్​ ఎన్నికలు జరగనున్నాయి. తాజా ఘటనను, ప్రభుత్వ వైఫల్యంగా ముడిపెడుతున్నారు కొందరు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి:

టాపిక్

తదుపరి వ్యాసం