తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Used Car Rules: యూజ్డ్ కార్ కొనాలన్నా, అమ్మాలన్నా ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే!

Used car rules: యూజ్డ్ కార్ కొనాలన్నా, అమ్మాలన్నా ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే!

HT Telugu Desk HT Telugu

16 September 2022, 21:00 IST

google News
  • New rules for used cars business: సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ చాలా పెద్దది. కొత్త కారు కొనే స్థోమత లేనివారు, అంత బడ్జెట్ తో పెట్టలేనివారు చూసేది యూజ్డ్ కార్ల వైపే. అలాగే, కొత్త కారు కొనేముందు, పాత కారును అమ్మేయడం కూడా కామనే. అయితే, ఈ యూజ్డ్ కార్ బిజినెస్ లో రూల్స్ మారుతున్నాయి. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Photo: Mint)

ప్రతీకాత్మక చిత్రం

New rules for used cars business: సెకండ్ హ్యాండ్ కార్ల బిజినెస్ కు సంబంధించి కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తోంది. ప్రస్తుతం ముసాయిదా రూపంలో ఉన్న ఈ నిబంధనలను త్వరలో Central Motor Vehicle Rules, 1989లో చేర్చనున్నారు.

New rules for used cars business: కొనేదెవరో, అమ్మేదెవరో తెలియదు

ఈ ముసాయిదా నిబంధనల ప్రకారం, యూజ్డ్ కారు అమ్ముతున్న వ్యక్తికి, కొంటున్న వ్యక్తికి ఎలాంటి సంబంధం ఉండదు. కారు ఎవరికి అమ్ముతున్నామో అమ్మే వ్యక్తికి, కారును ఎవరి నుంచి కొంటున్నామో కొనే వ్యక్తికి అస్సలు తెలియదు. ఈ క్రయ విక్రయాలన్నీ ఒక ఆథరైజ్డ్ డీలర్ ద్వారా జరుగుతాయి.

New rules for used cars business: ఆథరైజ్డ్ డీలర్ దే హవా

ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర రవాణా శాఖ కొందరికి ఈ బిజినెస్ కు సంబంధించి ఆథరైజ్డ్ డీలర్ షిప్ ఇస్తుంది. వారిద్వారా మాత్రమే యూజ్డ్ కార్ల రిజిస్ట్రేషన్ జరుగుతుంది. యూజ్డ్ కారును కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలను రవాణా శాఖ రికార్డుల్లో చేర్చే బాధ్యత ఈ డీలర్ కే ఉంటుంది. ముందుగా, ఆ యూజ్డ్ కారును ఆథరైజ్డ్ డీలర్ తన పేరు పైకి తాత్కాలికంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రి ఓన్డ్ కార్ల మార్కెట్ను నియంత్రించడం, ఆ రంగంలో పారదర్శకత తీసుకురావడం లక్ష్యంగా ఈ నిబంధనలను తీసుకువస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రకటించింది.

New rules for used cars business: డీలర్ అధికారాలు, బాధ్యతలు

ప్రభుత్వం అమలు చేయనున్న ఈ కొత్త నిబంధనలు ఆథరైజ్డ్ డీలర్లకు అధిక శాతం హక్కుల కల్పించే విధంగా ఉన్నాయి. ఆర్సీ రెన్యువల్, ఫిట్ నెస్ సర్టిఫికెట్, డూప్లికేట్ ఆర్సీ, ఎన్ ఓ సీ.. తదితర సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసే అధికారం ఇకపై డీలర్లకే ఉంటుంది.

New rules for used cars business: నియంత్రణ పెరుగుతుంది

ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త రూల్స్ వల్ల ఈ యూజ్డ్ కార్ల బిజినెస్ లో పారదర్శకత, ప్రభుత్వ నియంత్రణ మెరుగవుతుందని `కార్స్ 24` సీఈఓ కునాల్ ముంద్రా వ్యాఖ్యానించారు. `భవిష్యత్తులో ఈ మార్కెట్ విపరీతంగా వృద్ధి చెందే అవకాశమున్నందున, ప్రభుత్వ నియంత్రణ, సహకారం అత్యవసరం` అన్నారు.

తదుపరి వ్యాసం