తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Windfall Taxex: చమురు ఉత్పత్తుల ఎగుమతులపై పన్ను తగ్గింపు.. రివ్వుమన్న స్టాక్స్

Windfall taxex: చమురు ఉత్పత్తుల ఎగుమతులపై పన్ను తగ్గింపు.. రివ్వుమన్న స్టాక్స్

HT Telugu Desk HT Telugu

20 July 2022, 10:28 IST

google News
  • windfall taxes: చమురు ఉత్పత్తుల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం పన్ను తగ్గించింది. దీంతో సంబంధిత స్టాక్స్ అన్ని రివ్వున ఎగిశాయి.

ఎగుమతులపై పన్నులు తగ్గించిన కేంద్రప్రభుత్వం
ఎగుమతులపై పన్నులు తగ్గించిన కేంద్రప్రభుత్వం (HT_PRINT)

ఎగుమతులపై పన్నులు తగ్గించిన కేంద్రప్రభుత్వం

న్యూఢిల్లీ, జూలై 20: అంతర్జాతీయ రేట్లు తగ్గిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం పెట్రోల్, డీజిల్, జెట్ ఇంధనం, ముడి చమురు ఎగుమతులపై విండ్‌ఫాల్ టాక్స్ తగ్గించింది.

పెట్రోలు ఎగుమతిపై లీటరుకు రూ. 6 మేర పన్ను తగ్గించింది. ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 6 నుంచి రూ. 4కు తగ్గించింది. అలాగే డీజిల్‌‌కు లీటర్‌పై రూ.13 నుంచి రూ.11కి తగ్గించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ తెలిపింది.

అంతేకాకుండా దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై అదనపు పన్నును టన్నుకు రూ. 23,250 నుంచి రూ.17,000కు తగ్గించారు.

జూలై 1న కేంద్రం ఈ పన్నులు విధించింది. కానీ అంతర్జాతీయ ఇంధన ధరలు అప్పటి నుండి క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఈ చర్య వల్ల చమురు ఉత్పత్తిదారులు, రిఫైనర్ల లాభాల మార్జిన్లను తగ్గించాయి.

టాపిక్

తదుపరి వ్యాసం