తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Google Down : ప్రపంచవ్యాప్తంగా గూగుల్​ సేవలకు అంతరాయం!

Google down : ప్రపంచవ్యాప్తంగా గూగుల్​ సేవలకు అంతరాయం!

Sharath Chitturi HT Telugu

09 August 2022, 7:44 IST

  • Google down : గూగుల్​ సేవలకు మంగళవారం ఉదయం అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది.. గూగుల్​ను వినియోగించుకోలేకపోతున్నట్టు సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా గూగుల్​ సేవలకు అంతరాయం!
ప్రపంచవ్యాప్తంగా గూగుల్​ సేవలకు అంతరాయం! (REUTERS)

ప్రపంచవ్యాప్తంగా గూగుల్​ సేవలకు అంతరాయం!

Google down : ప్రపంచవ్యాప్తంగా.. మంగళవారం ఉదయం గూగుల్​ సేవలకు అంతరాయం కలిగినట్టు తెలుస్తోంది. అనేకమంది.. గూగుల్​ని వినియోగించుకోలేకపోతున్నట్టు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

ఇలాంటి ఔటేజ్​లను ట్రాక్​ చేసే డౌన్​డిటెక్టర్​.. ఈ విషయాన్ని వెల్లడించింది. గూగుల్​ సేవలు వినియోగించుకోలేకపోతున్నట్టు ఇప్పటికే 40వేల ఫిర్యాదులు అందినట్టు వెల్లడించింది.

ఈ వ్యవహారంపై గూగుల్​ ఇంకా స్పందించలేదు.

<p>ప్రపంచవ్యాప్తంగా గూగుల్​ సేవలకు అంతరాయం!</p>

పేటీఏం డౌన్​..

ఈ విధంగా.. ప్రముఖ సైట్ల సేవలు నిలిచిపోవడం ఈ మధ్య కాలంలో పెరిగిపోయింది. ఇటీవలే.. దేశంలో పేటీఎం సేవలకు కొన్ని గంటల పాటు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఆన్​లైన్​ యాప్స్​ సేవలను పరిశీలించే డౌన్​డిటెక్టర్​రు శుక్రవారం ఉదయం 10గంటల నాటికే 611 ఫిర్యాదులు అందాయి. ఫేటీఎం పనిచేయడం లేదని 66శాతం మంది వినియోగదారులు పేర్కొన్నారు. యాప్​లో సమస్యలు ఉన్నట్టు 29శాతం మంది పేర్కొన్నారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై , బెంగళూరు వంటి నగరాల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు.

పేటీఎంలో తలెత్తిన సమస్యలను ఉదయం 11:30 సమయంలో సంస్థ పరిష్కరించింది.