తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gobi Manchuria Banned : ఆ ప్రాంతంలో గోబి మంచూరియాపై నిషేధం- అసలు కథ ఏంటంటే..

Gobi Manchuria banned : ఆ ప్రాంతంలో గోబి మంచూరియాపై నిషేధం- అసలు కథ ఏంటంటే..

Sharath Chitturi HT Telugu

05 February 2024, 16:30 IST

    • Gobi Manchuria banned in Goa : గోబి మంచూరియా లవర్స్​కు షాకింగ్​ న్యూస్​! గోవాలోని మపుసాకు వెళితే మీరు ఈ స్టార్టర్​ డిష్​ని తినలేరు. దానిని అక్కడి అధికార యంత్రాంగా నిషేధించింది. కారణం ఏంటంటే..
ఆ ప్రాంతంలో గోబి మంచూరియాపై నిషేధం- అసలు కథ ఏంటంటే..
ఆ ప్రాంతంలో గోబి మంచూరియాపై నిషేధం- అసలు కథ ఏంటంటే..

ఆ ప్రాంతంలో గోబి మంచూరియాపై నిషేధం- అసలు కథ ఏంటంటే..

Gobi Manchuria banned : గోబి మంచూరియా అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి! వీలు కుదురినప్పుడల్లా ఇంట్లో చేసుకోవడం, లేదా రెస్టారెంట్​కి వెళితే.. అందరు ఆర్డర్​ చేసే స్టార్టర్స్​లో ఉండే ముఖ్యమైన ఐటెమ్​ ఈ గోబి మంచూరియా. కానీ.. చాలా మంది ఫేవరెట్​ ఫుడ్​పై నిషేధం విధించింది గోవాలోని ఓ పట్టణం! రెస్టారెంట్లే కాదు.. రోడ్డు పక్కన కనిపించే ఫుడ్​ స్టాల్స్​లో కూడా ఈ స్టార్టర్​ డిష్​ని అమ్మకూడదని తేల్చేసింది. గోబి మంచూరియాపై మపుసాకు అంత కోపం ఎందుకంటే..

ట్రెండింగ్ వార్తలు

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

గోవాలో గోబి మంచూరియాపై నిషేధం..

గోబి మంచూరియా తయారీలో సింథెటిక్​ కలర్స్​ వాడుతున్నారన్న కారణంతోనే దానిపై నిషేధం విధించింది మపుసా మున్సిపల్​ కౌన్సిల్​. అయితే.. గోవాలో ఈ స్టార్టర్​ డిష్​ని నిషేధించడం ఇది తొలిసారి కాదు! 2022లో జరిగిన వాస్కో సప్తా ఫెయిర్​ సమయంలోనూ ఇది నిషేధానికి గురైంది. అప్పుడు.. స్వయంగా, ఎఫ్​డీఏ (ఫుడ్​ అండ్​ డ్రగ్స్​ అడ్మినిస్ట్రేషన్​) నిషేధం విధించాలని సూచించింది. తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నారా? లేదా? అని తెలుసుకునేందుకు.. రైడ్లు కూడా నిర్వహించింది ఎఫ్​డీఏ!

Gobi Manchuria banned in Goa Mapusa : గోబి మంచూరియాపై మపుసా నిషేధం విధించడానికి.. శుభ్రత కూడా ఒక కారణం అని తెలుస్తోంది.

గోబీ మంచురియా ఎలా పుట్టిందంటే..

1970 దశకంలో ఇండియాలోకి తొలిసారిగా వచ్చింది చికెన్​ మంచూరియా. ముంబైకి చెందిన దిగ్గజ చైనీస్​ రెస్టారెంట్​ నెల్సన్​ వాంగ్​.. దీనిని రూపొందించి, క్రికెట్​ క్లబ్​ ఆఫ్​ ఇండియాకు సర్వ్​ చేసింది. ఏదైనా కొత్త డిష్​ని తయారు చేయాలని ఛాలెంజ్​గా తీసుకున్నారు నెల్సన్​ వంగ్​. స్పైసీ కార్న్​ఫ్లోర్​ బాటర్​లో చికెన్​ నగ్గెట్స్​ని డీప్​ ఫ్రె చేసి.. డ్రైగా లేదా సోయా సాస్​, వెనిగర్​, షుగర్​తో తయారు చేసిన ట్యాంగీ గ్రేవీతో సర్వ్​ చేశారు. అది బంపర్​ హిట్​ కొట్టింది. అది నాన్​ వెజ్​ ఫుడ్​. వెజిటేరియన్స్​కి కూడా అలాంటి రకమే ఒకటి ఉంటుందని భావించారు. అలా పుట్టుకొచ్చిందే ఈ గోబి మంచూరియా.

Mapusa bans Gobi Manchuria : వాస్తవానికి ఈ గోబి మంచూరియా గోవాలో లేదు. అనంతర కాలంలో గోవాలోని ట్రెడీషనల్​ ఫుడ్స్​కి గట్టి పోటీనిస్తూ.. గోబి మంచూరియా మంచి పేరు తెచ్చుకుంది.

తదుపరి వ్యాసం