తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Idli Manchurian | సౌత్ ఇండియన్ ఇడ్లీకి చైనీస్ ట్విస్ట్ ఇస్తూ అదిరిపోయే వంటకం!

Idli Manchurian | సౌత్ ఇండియన్ ఇడ్లీకి చైనీస్ ట్విస్ట్ ఇస్తూ అదిరిపోయే వంటకం!

HT Telugu Desk HT Telugu

16 June 2022, 19:21 IST

    • మీకు సాయంకాలం సమయంలో ఒకవైపు సౌత్- ఇండియన్ ఫుడ్ తినాలని ఉంది, మరోవైపు చైనీస్ ఫాస్ట్ ఫుడ్ తినాలని ఉంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మీరేం చేస్తారు? అందుకో మీకోసం ఇండో చైనీస్ వంటకం ఇడ్లీ మంచూరియన్ రెసిపీని పరిచయం చేస్తున్నాం.
Idli Manchurian
Idli Manchurian (iStock)

Idli Manchurian

సాయంత్రం వేళలో లభించే స్ట్రీట్ ఫుడ్ ఆప్షన్స్ చూసుకుంటే ఇడ్లీ, దోశలు వంటి సౌత్ ఇండియన్స్ టిఫిన్స్ లభిస్తాయి. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ రుచులు అందుబాటులో ఉంటాయి. మీకు సౌత్ ఇండియన్ వంటకాలు, చైనీస్ వంటకాలు రెండూ ఇష్టమైతే. సాయంత్రం స్నాక్స్ కోసం ఏ వంటకాలను తయారుచేయాలో తెలియక తికమక పడుతుంటే మీకోసం ఈ రెండింటిని కలిపేసే సౌత్ ఇండో చైనీస్ వంటకం ఒకటి తీసుకొచ్చాం. అదే ఇడ్లీ మంచూరియన్‌!

సౌత్ ఇండియన్ ఇడ్లీకి, చైనీస్ మంచూరియాతో ట్విస్ట్ ఇచ్చి తయారు చేస్తే మీకు ఇడ్లీ తిన్నట్లు ఉంటుంది. మంచూరియన్‌ తిన్నట్లు ఉంటుంది. ఈ ఫ్యూజన్ వంటకం ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతుంది. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలి? ఏమేం పదార్థాలు అవసరం అవుతాయో కింద రెసిపీని అందించాం. వీలైతే మీరూ ఒకసారి ట్రై చేయండి.

ఇడ్లీ మంచూరియన్‌ కోసం కావలసినవి:

  • ఇడ్లీలు - 10 ముక్కలు
  • 1 కప్పు తరిగిన క్యాబేజీ
  • 1 కప్పు క్యాప్సికమ్
  • 2 ఉల్లిపాయలు- తరిగినవి
  • 4 ఉల్లికాడలు తరిగినవి
  • 1 టీస్పూన్ అల్లం పేస్ట్
  • 1 టీస్పూన్ వెల్లుల్లి పేస్ట్
  • 2 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి
  • 2 స్పూన్ల సోయా సాస్
  • 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్
  • 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్
  • 1½ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్
  • 8 టేబుల్ స్పూన్ల నూనె
  • రుచికి తగినంత ఉప్పు

తయారీ విధానం

  1. ముందుగా ఒక పాన్ తీసుకొని, 2 టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేయండి. ఈ నూనెలో ముక్కలుగా చేసుకున్న ఇడ్లీలను తక్కువ మంట మీద బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి. ఇడ్లీలు కొద్దిగా క్రిస్పీగా అయ్యేలా చూసుకోండి.
  2. ఇప్పుడు ఇడ్లీలను పక్కనబెట్టి , అదే పాన్‌లో మిగిలిన నూనె వేసి వేడిచేయండి. ఆపై అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి టాసు చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో పైన చెప్పిన అన్ని సాస్‌లను వేసి కలపండి. మంట తక్కువగా ఉంచండి.
  3. మరోవైపు కార్న్ ఫ్లోర్‌లో అరకప్పు నీళ్లు పోసి బాగా మిక్స్ చేసి పైన చేసుకుంటున్న స్పైసీ మిశ్రమంలో వేసి కలపండి. కార్న్ ఫ్లోర్ మిక్స్‌లో ఉండలు లేకుండా చూసుకోవాలి. మీడియం మంట మీద 1 నిమిషం ఉడకనివ్వండి. రుచి ప్రకారం ఉప్పును సర్దుబాటు చేయండి.
  4. ఇప్పుడు వేయించిన ఇడ్లీలను కూడా పాన్‌లో వేసి స్పైసీ మిశ్రమం ఇడ్లీలకు బాగా పట్టుకునేలా కలపండి . చివరగా స్ప్రింగ్ ఆనియన్ ముక్కలతో గార్నిష్ చేయండి.

రుచికరమైన ఇడ్లీ మంచూరియన్‌ రెడీ అయినట్లే.. దీనిని వేడిగా సర్వ్ చేయండి. దీని టేస్టుకు మీరు పిచ్చెక్కిపోతారు.

టాపిక్

తదుపరి వ్యాసం