తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఆధార్​ కార్డులో బాలిక పేరు చూసి టీచర్లు షాక్​..!

ఆధార్​ కార్డులో బాలిక పేరు చూసి టీచర్లు షాక్​..!

HT Telugu Desk HT Telugu

04 April 2022, 18:42 IST

google News
    • ఉత్తర్​ప్రదేశ్​: ఆధార్​ కార్డులోని లోపాలతో ప్రజలు విసుగెత్తిపోయారు. వాటిల్లో ఎన్నో తప్పులు కనిపిస్తూ ఉంటాయి. తాజాగా.. ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్​ కోసం తన కుమార్తెను తీసుకుని వెళ్లాడు ఓ తండ్రి. కానీ ఆమెకు అడ్మిషన్​ దక్కలేదు. ఆధార్​ కార్డులో ఆమె పేరును చూసి షాక్​ అయిన యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.
ఆధార్​ కార్డులో బాలిక పేరు చూసి టీచర్లు షాక్​..!
ఆధార్​ కార్డులో బాలిక పేరు చూసి టీచర్లు షాక్​..! (Google)

ఆధార్​ కార్డులో బాలిక పేరు చూసి టీచర్లు షాక్​..!

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. బుదౌన్​ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల.. ఓ బాలిక అడ్మిషన్​ను తిరస్కరించింది. ఆధార్​ కార్డులో ఆమె పేరు చూసి షాక్​ అయిన స్కూలు సిబ్బంది ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ ఘటన శనివారం జరిగింది. రాయ్​పూర్​ గ్రామానికి చెందిన దినేష్​ అనే వ్యక్తి.. తన కుమార్తె ఆర్తిని తీసుకుని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాడు. మామూలుగా అయితే ఆధార్​ కార్డులో సాధారణ పేర్లు ఉంటాయి. కానీ ఆ బాలిక ఆధార్​ కార్డులో మాత్రం 'మధు కా పాంచ్వా బచ్చా'(మధు ఐదొవ సంతానం) అని రాసి ఉంది. పైగా ఆ ఆధార్​ కార్డుకు నెంబర్​ కూడా లేదు. ఇన్ని లోపాల కారణంగా స్కూలు యాజమాన్యం.. ఆ బాలిక అడ్మిషన్​ను తిరస్కరించింది. ఆధార్​ కార్డును మార్చుకుని రావాలని సూచించింది.

ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఆధార్​ కార్డులో తప్పు పేరు ఉండటంపై జిల్లా మెజిస్ట్రేట్​ దీపా రంజన్​ స్పందించారు. 'పోస్ట్​ ఆఫీసులు, బ్యాంకుల్లో ఆధార్​ కార్డును రూపొందిస్తారు. నిర్లక్ష్యం కారణంగానే ఈ తప్పులు జరిగాయి. అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తాము. ఈ ఘటనకు సంబంధించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము,' అని పేర్కొన్నారు.

తదుపరి వ్యాసం