తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gate - 2023: ఆగస్టులో 'గేట్' నోటిఫికేషన్ - ముఖ్య తేదీలు ఇవే

GATE - 2023: ఆగస్టులో 'గేట్' నోటిఫికేషన్ - ముఖ్య తేదీలు ఇవే

HT Telugu Desk HT Telugu

28 July 2022, 7:29 IST

google News
    • ఇంజినీరింగ్‌ విద్యలో పీజీ ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (Graduate Aptitude Test in Engineering​)–2023 పరీక్ష షెడ్యూల్ వారం రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 
గేట్ నోటిఫికేషన్ 2023
గేట్ నోటిఫికేషన్ 2023 (gate.iitk.ac.in)

గేట్ నోటిఫికేషన్ 2023

GATE Exam 2023: మరో వారం రోజుల్లో గెట్ - 2023 నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇంజినీరింగ్‌ విద్యలో పీజీ ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (Graduate Aptitude Test in Engineering​) షెడ్యూల్ పై ఇప్పటికే అధికారులు కసరత్తు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈసారి ఐఐటీ కాన్పూర్ పరీక్షను నిర్వహించనుంది. ఆగస్టు చివరి వారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 7వ తేదీతో గడువు ముగియనుంది. జనవరి నెలలలో అడ్మిట్ కార్డులు పొందే అవకాశం ఉంది.

వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 4 నుంచి 13వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఉన్న పలు నగరాలు, పట్టణాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఫలితాలు మార్చి 2023లో వస్తాయి.

దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సులు చేయడానికి గేట్‌ స్కోర్‌ కీలకమైంది. పలు ఉద్యోగ నియామకాల్లో కూడా ఈ స్కోర్ ఎంతో ఉపయోగపడుతుంది. మొత్తం 29 సబ్జెక్టుల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. గత ఏడాది 7.11 లక్షల మంది గేట్‌ రాశారు. వీరిలో 1.26 లక్షల మంది అర్హత సాధించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ఏటా దాదాపు లక్ష మందికిపైగా ఎగ్జామ్ రాస్తుంటారు. ఇక గేట్ పరీక్ష రాయబోయే అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకుని, ఆపై దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్ ఫార్మాట్‌లో పూరించాల్సి ఉంటుంది.

<p>గేట్ - 2023 షెడ్యూల్</p>

గేట్ షెడ్యూల్‌, అడ్మిట్​ కార్డుల వివరాల వంటి ఇతర అంశాలను ఐఐటీ కాన్పూర్ ​ అధికారిక వెబ్‌సైట్ https://gate.iitk.ac.in/ నుంచి పొందవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం