Shinde's Sena poll symbol: ‘‘రెండు కత్తులు, డాలు’’
11 October 2022, 18:40 IST
- Shinde's Sena poll symbol: శివసేనలో ‘వర్గ’ విబేధాలకు తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పెట్టింది ఎన్నికల సంఘం. ఉద్ధవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండే వర్గాలకు వేర్వేరు పేర్లు, వేర్వేరు గుర్తులు కేటాయించింది.
మహారాష్ట్ర సీఎం షిండే, ఆయన వర్గానికి ఈసీ కేటాయించిన గుర్తు
శివసేన ‘వర్గ’ విబేధాలకు తాత్కాలిక విరామం లభించింది. ఇరు వర్గాలకు వేర్వేరు పేర్లు, గుర్తులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
Shinde's Sena poll symbol: షిండేకు ‘డాల్ తల్వార్’
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేనను చీల్చి బీజేపీతో కలిసి అధికారం చేపట్టిన ఏక్ నాథ్ షిండే వర్గానికి ‘రెండు కత్తులు, డాలు('two swords and a shield)’ గుర్తును ఈసీ కేటాయించింది. మంగళవారం ఉదయం షిండే వర్గం సమర్పించిన మూడు ఆప్షన్లలో నుంచి ఈ గుర్తును ఎంపిక చేసింది. ఇప్పటికే షిండే వర్గానికి ‘బాలా సాహెబాంచి శివసేన’గా ఈసీ పేరు పెట్టిన విషయం తెలిసిందే. అంతకుముందు, షిండే వర్గం కోరుకున్న త్రిశూలం, ఉదయించే సూర్యుడు, గద గుర్తుల్లో ఏ గుర్తును కూడా కేటాయించలేమని స్పష్టం చేసిన ఈసీ, కొత్తగా మరో మూడు ఆప్షన్లు ఇవ్వాలని కోరింది.
Shinde's Sena poll symbol: ఉద్ధవ్ కు కాగడా..
ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్రలో అధికార పీఠంతో పాటు, శివసేన పార్టీపై ఆధిపత్యం కోల్పోయిన ఉద్ధవ్ ఠాక్రేకు, తాజాగా ‘కాగడా(flaming torch)’ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి ‘శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే’ పేరును ఎంపిక చేసింది. ఠాక్రే, షిండే వర్గాల వివాదం కారణంగా.. శివసేన గుర్తు అయిన విల్లంబులను తాత్కాలికంగా ఈసీ ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే.