తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Fodder Scam | లాలూ ప్రసాద్​ యాదవ్​కు ఐదేళ్ల జైలు శిక్ష

Fodder scam | లాలూ ప్రసాద్​ యాదవ్​కు ఐదేళ్ల జైలు శిక్ష

Sharath Chitturi HT Telugu

21 February 2022, 14:55 IST

google News
  • Fodder scam case | ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​.. దాణా కుంభకోణానికి సంబంధించిన 5వ కేసులో దోషిగా తేలిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 60లక్షల జరిమానా విధించింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.

లాలూ ప్రసాద్​ యాదవ్​ (ఫైల్​ ఫొటో)
లాలూ ప్రసాద్​ యాదవ్​ (ఫైల్​ ఫొటో) (HT_PRINT)

లాలూ ప్రసాద్​ యాదవ్​ (ఫైల్​ ఫొటో)

Fodder scam news | దాణా కుంభకోణానికి సంబంధించిన 5వ కేసులో దోషిగా తేలిన ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​కు.. 5ఏళ్ల జైలు శిక్ష విధించింది ఝార్ఖండ్​లోని ఓ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. జైలు శిక్షతో పాటు రూ. 60లక్షల జరిమానాను కూడా విధించింది.

దోరండా ఖజానా నుంచి రూ. 139.55కోట్లు అక్రమంగా ఉపసంహరించారన్న ఈ కేసులో.. ఈ నెల 15న బీహార్​ మాజీ ముఖ్యమంత్రి, 73ఏళ్ల లాలూ దోషిగా తేలారు. ఈ కేసులో మొత్తం 99మంది ఆరోపణలు ఎదుర్కోగా.. 24మందిని కోర్టు నిర్దోషులుగా కోర్టు నిర్ధరించింది. కాగా 46మందికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. లాలూ సహా మిగిలిన వారికి సోమవారం శిక్ష ఖరారైంది.

అవిభజిత బిహార్​ రాష్ట్రంలో.. ప్రభుత్వ ఖాజనాల నుంచి రూ. 950కోట్ల నగదును అక్రమంగా ఉపసంహరించారన్నది అసలు కంభకోణం. ఇందుకు సంబంధించిన నాలుగు కేసుల్లో లాలూ ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నారు. కాగా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న 170మందిలో 55మంది ఇప్పటికే మరణించారు. ఏడుగురు.. ప్రభుత్వం తరఫున సాక్షులుగా మారిపోయారు. ఆరుగురు పరారీలో ఉన్నారు. ఇద్దరు.. చేసిన తప్పును అంగీకరించారు. లాలూ సహా మిగిలిన 99మందిపై తాజాగా విచారణ ముగిసింది.

కుంభకోణం బయటపడిందిలా…

fodder scam timeline | 1996 జనవరిలో పశుసంవర్ధకశాఖలో అధికారులు రైడ్​ చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అనంతరం అదే ఏడాది మార్చ్​లో ఈ కేసు సీబీఐ చేతికి వెళ్లింది. ఝార్ఖండ్​, బిహార్​ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు.. సీబీఐ ఎఫ్​ఐఆర్​ నమోదు చేసింది. 1997లో సీబీఐ ఛార్జ్​ షీట్​లో తొలిసారిగా లాలూ ప్రసాద్​ యాదవ్​ పేరు కనిపించింది. ఈ నేపథ్యంలో.. విపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవడం వల్ల సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు. అనంతరం 1997జులైలో ఆయన సతీమణి రబ్రీ దేవీ.. సీఎంగా ప్రమాణం చేశారు.

రాష్ట్రం విడిపోయిన తర్వాత.. 2001 అక్టోబర్​లో ఈ కేసు ఝార్ఖండ్​ హైకోర్టుకు బదిలీ అయ్యింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. 2002 ఫిబ్రవరిలో విచారణ చేపట్టింది. 2013లో లాలూకు తొలిసారి శిక్ష పడింది. 5ఏళ్ల పాటు ఆయనకు జైలు శిక్ష విధించింది. ఫలితంగా ఆయన లోక్​సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. అదే ఏడాది డిసెంబర్​లో ఆయనకు బెయిల్​ మంజూరు అయ్యింది.

Lalu Prasad Yadav cases | ఇక రెండో కేసులో దోషిగా తేలిన లాలూకు.. 2017 డిసెంబర్​లో మరోమారు శిక్షపడింది. 3.5ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది కోర్టు. అయితే గతేడాది జులైలో ఆయనకు బెయిల్​ దక్కింది.

ఇక 2018లోనే మూడో కేసులో బీహార్​ మాజీ ముఖ్యమంత్రి దోషిగా తేలారు. అందుకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. అదే ఏడాది మార్చ్​లో.. దాణా కుంభకోణంలో అవినీతి, కుట్రపూరిత చర్యలకుగానూ లాలూను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చి.. మొత్తం మీద 14ఏళ్ల జైలు శిక్ష, రూ. 60లక్షల ఫైన్​ విధించింది. ఇక ఇప్పుడు 5వ కేసులో లాలూకు ఐదేళ్ల శిక్ష పడింది.

తదుపరి వ్యాసం