తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం - ఐదుగురు సజీవదహనం

కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం - ఐదుగురు సజీవదహనం

24 March 2024, 8:00 IST

  • Fire Accident in Rajasthan :  రాజస్థాన్ లోని జైపూర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం ఓ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ ఘటనలో.. ఐదుగురు సజీవ దహనమయ్యారు. మరో వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు.

జైపూర్ లో అగ్నిప్రమాదం
జైపూర్ లో అగ్నిప్రమాదం (ANI)

జైపూర్ లో అగ్నిప్రమాదం

Rajasthan Chemical Factory Fire Accident: రాజస్థాన్ లో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) చోటు చేసుకుంది. జైపూర్ పరిధిలోని బస్సి ప్రాంతంలోని ఓ కెమిల్ ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించాయి. శనివారం జరిగిన ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. తొమ్మిది అగ్నిమాపక వాహనాలను అందుబాటులోకి ఉంచి మంటలను అదుపు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

బస్సీ ప్రాంత చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ దేవెంద్ర కుమార్ మాట్లాడుతూ... కెమికల్ ఫ్యాక్టరీని చట్ట విరుద్ధంగా నడుపుతున్నట్లు గుర్తించామని చెప్పారు. ఫ్యాక్టరీ యజమాని కూడా ఇక్కడ లేడని అన్నారు. ఇక్కడ రసాయనాల డ్రమ్ములు చాలా ఉన్నాయని… లోపల ఏముందో ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు.

జైపూర్ జిల్లా కలెక్టర్ ప్రకాశ్ మాట్లాడుతూ…. శనివారం సాయంత్రం తర్వాత ఈ ప్రమాదం జరిగిందన్నారు. బాయిలర్ ప్యాక్టరీలో ఈ ఘటన జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని వెల్లడించారు. మరో వ్యక్తికి చికిత్స కొనసాగుతుందని… 65 శాతం కాలిన గాయాలయ్యాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.జైపూర్ కమిషనర్ బిజూ జార్జ్ స్పందిస్తూ….. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారని చెప్పారు.ఈ విషయంపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని చెప్పారు. పరారీలో ఉన్న ఫ్యాక్టరీ యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారని వెల్లడించారు.

సీఎం సంతాపం….

రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ… మృతులకు సంతాపం తెలిపారు. బాధితులకు అన్ని సహాయాలు అందించాలని అధికారులను ఆదేశించారు. “జైపూర్‌ సమీపంలోని బస్సీలోని కెమికల్‌ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో పౌరులు మృతి చెందడం చాలా బాధాకరం. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని, బాధిత ప్రజలకు అన్ని విధాలా సాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించాం” అని శర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

టాపిక్

తదుపరి వ్యాసం