Fire accident : షాపింగ్​ మాల్​లో ఘోర అగ్నిప్రమాదం.. 44 మంది దుర్మరణం!-bangladesh news at least 44 killed in dhaka fire accident on bailey road ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Fire Accident : షాపింగ్​ మాల్​లో ఘోర అగ్నిప్రమాదం.. 44 మంది దుర్మరణం!

Fire accident : షాపింగ్​ మాల్​లో ఘోర అగ్నిప్రమాదం.. 44 మంది దుర్మరణం!

Sharath Chitturi HT Telugu
Mar 01, 2024 07:18 AM IST

Bangladesh fire accident : బంగ్లాదేశ్​లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢాకాలోని ఓ షాపింగ్​ మాల్​లో మంటలు చెలరేగిన ఘటనలో 44మంది మరణించారు.

షాపింగ్​ మాల్​లో ఘోర అగ్నిప్రమాదం.. 44 మంది దుర్మరణం!
షాపింగ్​ మాల్​లో ఘోర అగ్నిప్రమాదం.. 44 మంది దుర్మరణం!

Bangladesh fire accident : ఘోర అగ్నిప్రమాదంతో బంగ్లాదేశ్​ రాజధాని ఢాకా ఉలిక్కిపడింది! ఓ షాపింగ్​ మాల్​లో సంభవించిన అగ్నిప్రమాదంలో 44మంది మరణించారు. మరో 20మంది గాయపడ్డారు.

ఇదీ జరిగింది..

ఢాకాలోని బైలే రోడ్డులో గ్రీన్​ కోజీ కాజేట్​ పేరుతో.. ఓ కమర్షియల్​ షాపింగ్​ మాల్​ ఉంది. అందులో అనేక రెస్టారెంట్లు ఉన్నాయి. కాగా.. స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి 9 గంటల 45 నిమిషాల సమయంలో.. మొదటి అంతస్తులోని 'కచ్చి భాయ్​' అనే రెస్టారెంట్​లో మంటలు చెలరేగాయి. కొన్ని క్షణాల్లోనే మంటలు మొదటి అంతస్తును వ్యాపించాయి. అనంతరం ఇతర ఫ్లోర్లకు కూడా మంటలు వ్యాపించాయి.

Dhaka fire accident today : బంగ్లాదేశ్​ అగ్నిప్రమాదం సమయంలో.. రెస్టారెంట్లలో చాలా మంది భోజనం చేస్తున్నారు. మంటలను చూసి వెంటనే.. మాల్​ లోపల ఉన్న ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు. తమని తాము రక్షించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో.. భవనం మీద నుంచి చాలా మంది దూకి ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరు పొగకు ఊపిరి ఆడక మరణించారు. ఇంకొందరు.. కాలిన గాయాలతో ప్రాణాలు విడిచారు.

ఢాకా అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు.. ఘటనాస్థలానికి వెంటనే పరుగులు తీశారు. 13 ఫైర్​ సర్వీస్​ యూనిట్​లు.. తీవ్రంగా శ్రమించి, అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో మంటలను అదుపు చేశారు. అనంతరం.. 75మందిని రక్షించారు. వారిలో స్పహృకోల్పోయి, నేల మీద పడి ఉన్న 42మంది కూడా ఉన్నారు.

Dhaka fire accident death toll : ఆరోగ్య శాఖ మంత్రి సమంత లాల్​ సేన్​తో పాటు ఇతర అధికారులు సైతం ఘటనాస్థలానికి వెళ్లి, సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు.

"బంగ్లాదేశ్​ అగ్నిప్రమాదం ఘటనలో 44మంది మరణిచారు.75మందిని రక్షించాము. ప్రస్తుతం వారందరు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు," అని ఓ సీనియర్​ పోలీసు అధికారి వివరించారు.

ఢాగా అగ్నిప్రమాదానికి కారణం ఏంటి?

Bangladesh fire accident death toll : వివిధ అంతస్తుల్లోని రెస్టారెంట్స్​లో ఉన్న గ్యాస్​ సిలిడర్ల కారణంగా బంగ్లాదేశ్​ అగ్నిప్రమాదం ఘటన చోటుచేసుకుని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. తొలుత మొదటి అంతస్తులో గ్యాస్​ సిలిండర్​ పేలి ఉండొచ్చని, అది మిగిలిన అంతస్తులకు వ్యాపించి ఉండొచ్చని భావిస్తున్నారు. దట్టమైన పొగ అలుముకోవడంతో ప్రజలు సరిగ్గా చూడలేకపోయారని, ఫలితంగా మృతుల సంఖ్య భారీగా ఉందని అధికారులు వెల్లడించారు.

మరోవైపు.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు, త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం