తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  నిర్మాత క్రెడిట్ కార్డును వాడేసిన దొంగలెవరు?

నిర్మాత క్రెడిట్ కార్డును వాడేసిన దొంగలెవరు?

HT Telugu Desk HT Telugu

27 May 2022, 16:33 IST

google News
  • ప్రముఖ నిర్మాత, నటి జాన్వీ కపూర్ తండ్రి బోనీకపూర్ క్రెడిట్ కార్డును గుట్టుచప్పుడు కాకుండా వాడేసి రూ. 3.82 లక్షలు ఖర్చు చేసేశారు. 

కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌తో నిర్మాత బోనీకపూర్ (ఫైల్ ఫోటో)
కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌తో నిర్మాత బోనీకపూర్ (ఫైల్ ఫోటో) (Sunil Khandare)

కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌తో నిర్మాత బోనీకపూర్ (ఫైల్ ఫోటో)

ముంబై, మే 27 : ప్రముఖ సినీ నిర్మాత బోనీ కపూర్ క్రెడిట్ కార్డ్ ద్వారా మోసపూరితంగా రూ. 3.82 లక్షల లావాదేవీలు జరిపారని గుర్తు తెలియని వ్యక్తిపై ఫిర్యాదు నమోదైందని ముంబై పోలీసు అధికారి శుక్రవారం తెలిపారు. బోనీకపూర్ సహాయకుడు ఈ ఫిర్యాదు చేశారని వివరించారు.

ఐపీసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని నిబంధనల ప్రకారం బుధవారం అంబోలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. బోనీ కపూర్ వివరాలు, పాస్‌వర్డ్‌ను తెలుసుకోవడం ద్వారా ఫిబ్రవరి 9న ఐదు ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించడానికి క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మార్చి 30న తన బ్యాంక్ నుండి ఎగ్జిక్యూటివ్ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు కోసం కాల్ చేసినప్పుడు జరిగిన మోసాన్నిబోనీ కపూర్ తెలుసుకున్నారు.

దర్యాప్తు ప్రారంభించామని, నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అంబోలి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

టాపిక్

తదుపరి వ్యాసం