Elephants to protect Namibia cheetahs| నమీబియా చిరుతలకు గజరాజుల రక్షణ
20 September 2022, 15:34 IST
Elephants to protect Namibia cheetahs| నమీబియా నుంచి తీసుకువచ్చిన 8 చిరుతలకు రక్షణ కల్పించడానికి సత్పూరా టైగర్ రిజర్వ్ నుంచి రెండు ఏనుగులను తీసుకువచ్చారు. పులుల రక్షణలో వీటికి మంచి అనుభవం ఉందట. అలాగే ప్రస్తుతానికి నమీబియా చీతాలను క్వారంటైన్ లో ఉంచారు. నెల రోజుల పాటు అవి ప్రత్యేక ఎన్ క్లోజర్లో ఉంటాయి.
నమీబియా చీతాలకు రక్షణగా తీసుకువచ్చిన గజరాజు
Elephants to protect Namibia cheetahs| నమీబియా నుంచి తీసుకువచ్చిన చిరుతల రక్షణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ చిరుతలకు ఇతర క్రూర జీవుల నుంచి రక్షణ కల్పించడానికి సత్పూర టైగర్ రిజర్వ్ నుంచి రెండు ఏనుగులకు నెల క్రితమే మధ్య ప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ కు తీసుకువచ్చారు. భారత్ లో అంతరించిన చిరుత జాతిని మళ్లీ వృద్ధి చేసే లక్ష్యంతో ప్రత్యేక ఒప్పందం ద్వారా నమీబియా నుంచి 8 చిరుతలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వాటిని ప్రధాని మోదీ తన పుట్టిన రోజైన సెప్టెంబర్ 17న కునొ నేషనల్ పార్క్ లో వదిలారు.
Elephants to protect Namibia cheetahs| లక్ష్మి, సిద్ధాంత్
వేరే వాతావరణ పరిస్థితుల నుంచి భారత్ వచ్చి చిరుతలు ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతకాలం పాటు వాటిని ప్రత్యేక ఎన్ క్లోజర్ లో ఉంచుతున్నారు. అవి ఉంటున్న ఎన్ క్లోజర్ పరిసరాల్లోకి వేరే క్రూర జీవులు, వన్య జీవులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో బాగంగానే, సత్పురా టైగర్ రిజర్వ్ నుంచి లక్ష్మి, సిద్ధాంత్ అనే రెండు ఏనుగులను తీసుకువచ్చారు. అవి చిరుతలు ఉండే ఎన్ క్లోజర్ పరిసరాల్లో పహారా కాస్తాయి. వాటికి సత్పూరా టైగర్ రిజర్వ్ లో పులులకు రక్షణ కల్పించిన అనుభవం ఉంది. కునొ నేషనల్ పార్క్ అలవాటు కావడం కోసం నెల ముందే వాటిని తీసుకువచ్చి, ఈ నేషనల్ పార్క్ లో వదిలారు. ఇవి ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులతో పాటు పహారా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాయి.
Elephants to protect Namibia cheetahs| ఇద్దరు మావటిలను చంపేసిన కోపిష్టి సిద్ధాంత్
అయితే, ఈ రెండు ఏనుగుల్లో 25 ఏళ్ల లక్ష్మి చాలా నెమ్మదైనదని, కానీ పనిలో మాత్రం ఎక్స్ పర్ట్ అని, 30 ఏళ్ల సిద్ధాంత్ మాత్రం కోపిష్టిదని అధికారులు చెబుతున్నారు. ఇద్దరు మావటిలను చంపేసిన చరిత్ర సిద్ధాంత్ కు ఉందని వెల్లడించారు.
Elephants to protect Namibia cheetahs| మొత్తం 8 చీతాలు.. పేర్లు కూడా ఉన్నాయి
నమీబియా నుంచి మొత్తం 8 చీతాలను తీసుకువచ్చారు. వాటిలో ఐదు ఆడవి, మూడు మగవి. అవి అన్ని కూడా 30 నుంచి 66 నెలల వయస్సులో ఉన్నాయని కునో నేషనల్ పార్క్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం అన్ని చిరుతలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయని,అయితే, ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటయ్యే వరకు వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. ఆ ఎనిమిది చీతాలకు సవన్నా, ఆల్టన్, ఫ్రెడ్డీ, సాషా, ఒబాన్, ఆశా, సిబిలి, సైసా.. అని పేర్లు పెట్టారు.
Elephants to protect Namibia cheetahs| కునో పార్క్
కునో నేషనల్ పార్క్ మధ్య ప్రదేశ్ లో ఉంది. వింధ్యాచల్ పర్వతాలకు ఉత్తరంగా 750 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.