తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Equity Mutual Fund : మే నెలలో మ్యూచువల్ ఫండ్స్‌లోకి రూ. 18,529 కోట్ల

Equity Mutual Fund : మే నెలలో మ్యూచువల్ ఫండ్స్‌లోకి రూ. 18,529 కోట్ల

HT Telugu Desk HT Telugu

09 June 2022, 16:27 IST

google News
    • ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మే నెలలో రూ. 18,529 కోట్ల మేర ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షించాయి.
మ్యూచువల్ ఫండ్స్‌లోకి కొనసాగుతున్న నిధుల ప్రవాహం
మ్యూచువల్ ఫండ్స్‌లోకి కొనసాగుతున్న నిధుల ప్రవాహం (REUTERS)

మ్యూచువల్ ఫండ్స్‌లోకి కొనసాగుతున్న నిధుల ప్రవాహం

న్యూఢిల్లీ, జూన్ 9: స్టాక్ మార్కెట్లలో పెరిగిన అస్థిరత, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) స్థిరమైన అమ్మకాల మధ్య మే నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లు వరుసగా 15వ నెలలో సానుకూలంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి.

ఏప్రిల్‌లో వచ్చిన రూ. 15,890 కోట్ల నికర ఇన్‌ఫ్లోతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) గురువారం వెల్లడించింది.

ఈక్విటీ పథకాలు మార్చి 2021 నుండి నికర ఇన్‌ఫ్లోను చూస్తున్నాయి. ఇది పెట్టుబడిదారులలో సానుకూల సెంటిమెంట్‌ను హైలైట్ చేస్తుంది.

ఆయా పథకాలు జులై 2020 నుండి ఫిబ్రవరి 2021 వరకు ఎనిమిది నెలల పాటు స్థిరంగా రూ. 46,791 కోట్లను కోల్పోయాయి.

అన్ని ఈక్విటీ-ఆధారిత కేటగిరీలు మేలో నికర ఇన్‌ఫ్లోలను పొందాయి. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కేటగిరీ రూ. 2,939 కోట్ల నికర ఇన్‌ఫ్లోతో అతిపెద్ద లబ్ధిదారుగా ఉంది.

అంతేకాకుండా లార్జ్-క్యాప్, లార్జ్ అండ్ మిడ్-క్యాప్ ఫండ్, సెక్టోరల్/థీమాటిక్ ఫండ్‌లు ఒక్కొక్కటి రూ. 2,200 కోట్ల నికర ఇన్‌ఫ్యూషన్‌ను పొందాయి.

‘ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా అనిశ్చితి, సరఫరా అంతరాయాలు, అధిక ద్రవ్యోల్బణం, తక్కువ ఆర్థిక వృద్ధి అంచనాలను మార్కెట్లు ఎదుర్కొంటున్నప్పటికీ, పెట్టుబడిదారులు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లను ఎంచుకుంటున్నారు’ అని ఎఫ్‌వైఈఆర్ఎస్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి అన్నారు.

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) ద్వారా వచ్చే ఇన్‌ఫ్లో ఏప్రిల్‌లో రూ. 11,863 కోట్ల నుండి మేలో రూ. 12,286 కోట్లకు పెరిగింది. ఈక్విటీ పెట్టుబడులపై రిటైల్ ఇన్వెస్టర్లు విశ్వాసాన్ని కొనసాగించడాన్ని ఇది సూచిస్తుంది. సిప్ ఇన్‌ఫ్లో రూ. 10,000 కోట్ల కంటే ఎక్కువగా ఉండటం ఇది వరుసగా తొమ్మిదో నెల. ఈ ట్రెండ్ సెప్టెంబర్ 2021లో రూ.10,351 కోట్ల ఇన్‌ఫ్లోతో ప్రారంభమైంది.

ఈక్విటీతో పాటు, గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) కేటగిరీలో రూ. 203 కోట్ల ఇన్ ఫ్లో వచ్చింది.

మరోవైపు మే నెలలో రూ. 69,883 కోట్ల నికర ఇన్‌ఫ్లో నమోదు చేసిన తర్వాత డెట్ కేటగిరీ రూ. 32,722 కోట్ల నికర ఔట్ ఫ్లో చూసింది.

టాపిక్

తదుపరి వ్యాసం