Jayaprada: జయప్రదకు ఆర్నెళ్ల జైలు శిక్ష
11 August 2023, 16:34 IST
- Jayaprada: ప్రముఖ నటి, ఎంపీ జయప్రదకు తమిళనాడు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. చెన్నైలోని ఎగ్మూర్ కోర్టు శుక్రవారం ఈ శిక్ష విధించింది. చెన్నైలోని రాయపేటలో జయప్రదకు ఉన్న సినిమా థీయేటర్ ఉద్యోగులు వేసిన కేసులో ఆమెకు ఈ శిక్ష పడింది.
ప్రముఖ నటి, ఎంపీ జయప్రద
Jayaprada: ప్రముఖ నటి, ఎంపీ జయప్రదకు తమిళనాడు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. చెన్నైలోని ఎగ్మూర్ కోర్టు శుక్రవారం ఈ శిక్ష విధించింది. ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా కూడా విధించింది. చెన్నైలోని రాయపేటలో జయప్రదకు ఉన్న సినిమా థీయేటర్ ఉద్యోగులు వేసిన కేసులో ఆమెకు ఈ శిక్ష పడింది.
డబ్బులు చెల్లిస్తామన్నా..
తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి, హీరోయిన్ గా గొప్ప పేరు సంపాదించిన జయప్రద ప్రస్తుతం పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు. చెన్నైలోని రాయపేటలో జయప్రదకు సినిమా థీయేటర్ ఉంది. ఆ థీయేటర్ నిర్వహణ బాధ్యతలను రామ్ కుమార్, రాజాబాబు చూసేవారు. నష్టాలు రావడంతో ఆ థీయేటర్ ను మూసేశారు. ఆ సమయంలో, అంతకుముందు థీయేటర్ ఉద్యోగుల నుంచి వసూలు చేసిన ఈఎస్ఐ డబ్బులను యాజమాన్యం ఉద్యోగులకు తిరిగి ఇవ్వలేదు. దాంతో, ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఈఎస్ఐ కూడా ఇంప్లీడ్ అయింది. అయితే, ఆ మొత్తం డబ్బులను చెల్లిస్తానని, కేసును కొట్టివేయాలని జయప్రద కోర్టును కోరారు. ఆమె అభ్యర్థనను ఈఎస్ఐ తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు. దాంతో, కోర్టు జయప్రదకు, ఆమెతో పాటు మరో ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు, రూ. 5వేల జరిమానా చొప్పున విధించింది.