తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ed Raids In Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మళ్లీ ఈడీ దాడులు

ED raids in excise policy case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మళ్లీ ఈడీ దాడులు

HT Telugu Desk HT Telugu

14 October 2022, 15:30 IST

google News
  • ED raids in excise policy case: లిక్కర్ పాలసీ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. తాజాగా, శుక్రవారం ఢిల్లీలో 25 చోట్ల సోదాలు నిర్వహించింది.

ఢిల్లీలో శుక్రవారం ఈడీ దాడుల దృశ్యం
ఢిల్లీలో శుక్రవారం ఈడీ దాడుల దృశ్యం

ఢిల్లీలో శుక్రవారం ఈడీ దాడుల దృశ్యం

ED raids in excise policy case: ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ విధానం కుంభకోణంలో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ పై కక్ష సాధింపులో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం మరోసారి ఢిల్లీలో ఈడీ సోదాలు నిర్వహించింది.

ED raids in excise policy case: 25 చోట్ల సోదాలు..

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కు సంబంధించి శుక్రవారం ఈడీ ఢిల్లీలోని 25 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. 2021-22 ఎక్సైజ్ పాలసీపై పలు ఆరోపణలు రావడంతో ఈ పాలసీని ఢిల్లీ ప్రభుత్వం గతంలోనే రద్దు చేసింది. ఈ పాలసీలో జరిగిన అవకతవకలపై ఈడీతో పాటు సీబీఐ కూడా విచారణ జరుపుతోంది. ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా సిఫారసుల మేరకు సీబీఐ ఈ కేసు చేపట్టింది.

ED raids in excise policy case: గతవారం కూడా..

గత వారం కూడా ఈ కేసులో ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, ఢిల్లీ, పంజాబ్ ల్లోని 35 లొకేషన్లపై దాడులు చేసింది. ఈ కేసులో సీబీఐ ఇప్పటికే అరెస్ట్ చేసిన సమీర్ మహేంద్రు ఇచ్చిన కీలక సమాచారంతో ఈడీ తాజా దాడులు చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కూడా నిందితుడిగా ఉన్నారు. దీనిపై ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. గత మూడు నెలలుగా 300 మంది అధికారులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నా.. మనీశ్ సిసోడియాకు వ్యతిరేకంగా ఏ ఒక్క ఆధారాన్ని గుర్తించలేకపోయారని ఆయన విమర్శించారు. ‘వారికి ఏమీ దొరకదు.. ఎందుకంటే మేం ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి’ అని ఆయన ట్వీట్ చేశారు.

తదుపరి వ్యాసం