తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Makara Jyothi Darshanam: శబరిమలలో మకర జ్యోతి దర్శనం

Makara jyothi darshanam: శబరిమలలో మకర జ్యోతి దర్శనం

HT Telugu Desk HT Telugu

14 January 2023, 18:37 IST

    • శబరిమలలో శనివారం సాయంత్రం పవిత్ర మకర జ్యోతి దర్శనమిచ్చింది. వేలాదిగా అయ్యప్ప భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ మకర జ్యోతిని దర్శించుకున్నారు.
అయ్యప్ప స్వామి, మకర జ్యోతి (ఫైల్ ఫొటో)
అయ్యప్ప స్వామి, మకర జ్యోతి (ఫైల్ ఫొటో)

అయ్యప్ప స్వామి, మకర జ్యోతి (ఫైల్ ఫొటో)

శబరిమలలో శనివారం సాయంత్రం పవిత్ర మకర జ్యోతి దర్శనమిచ్చింది. అయ్యప్ప భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ మకర జ్యోతిని దర్శించుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Houston floods : టెక్సాస్​- హూస్టన్​ని ముంచెత్తిన వరద.. భయం గుప్పిట్లో ప్రజలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

సాయంత్రం 6.45 గంటలకు..

ఈ సంవత్సరం మకర జ్యోతి దర్శనం శనివారం సాయంత్రం 6.45 గంటల దర్శనమిచ్చింది. దీనినే ‘మకరవిలక్కు‘గా పేర్కొంటారు. ఈ సమయంలో అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో దర్శనమిస్తాడని భక్తుల నమ్మకం. శబరిమలలో రాత్రి 8.45 గంటల సమయంలో శబరి మల ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మకర విలక్కు సమయంలో సన్నిధానంలో 40 వేల మంది భక్తులకు అనుమతినిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మకర విలక్కు సందర్భంగా శబరి మల నుంచి దూరంగా ఉన్న పొన్నంబలమేడు నుంచి మకర జ్యోతి వెలుగుతూ కనిపిస్తుంది. మకర జ్యోతి దర్శనాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో దాదాపు మూడు సార్లు పవిత్ర మకర జ్యోతి దర్శనమిచ్చింది. ఆ సమయంలో శబరి గిరులు స్వామియే శరణం అయ్యప్ప అనే శరణు ఘోషతో దద్ధరిల్లాయి. వేలాదిగా భక్తులు ప్రత్యక్షంగా, లక్షలాదిగా భక్తులు టీవీల్లో పరోక్షంగా జ్యోతిని దర్శించుకున్నారు.

టాపిక్