తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Data Protection Bill: డేటా ప్రొటెక్షన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం; చట్టాన్ని ఉల్లంఘిస్తే ఫైన్ ఎంతో తెలుసా?

Data Protection bill: డేటా ప్రొటెక్షన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం; చట్టాన్ని ఉల్లంఘిస్తే ఫైన్ ఎంతో తెలుసా?

HT Telugu Desk HT Telugu

06 July 2023, 12:05 IST

google News
  • Data Protection bill: డేటా ప్రొటెక్షన్ (Data Protection) బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నిబంధనలను ఉల్లంఘిస్తే ప్రైవేటు లేదా ప్రభుత్వ సంస్థలు రూ. 250 కోట్ల వరకు జరిమానా చెల్లించాలని పలు ప్రతిపాదనలను ఆ బిల్లులో పొందుపర్చారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Data Protection bill: డేటా ప్రొటెక్షన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నిబంధనలను ఉల్లంఘిస్తే ప్రైవేటు లేదా ప్రభుత్వ సంస్థలు రూ. 250 కోట్ల వరకు జరిమానా చెల్లించాలని పలు ప్రతిపాదనలను ఆ బిల్లులో పొందుపర్చారు. ఆ జరిమానాను రూ. 500 కోట్ల వరకు పెంచే అధికారాన్ని అపిలేట్ అథారిటీకి అప్పగించాలనే ప్రతిపాదన కూడా ఉంది.

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు (Digital Personal Data Protection DPDP) పేరుతో రూపొందించిన ఈ బిల్లులో పలు కఠినమైన నిబంధనలు ఉన్నాయి. పార్లమెంటు ఆమోదం పొంది,చట్టంగా మారిన అనంతరం, ఇది భారత దేశ తొలి వ్యక్తిగత సమాచార పరిరక్షణ చట్టంగా అవతరిస్తుంది. వ్యక్తిగత సమాచార పరిరక్షణ ధ్యేయంగా ఈ బిల్లును రూపొందించారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రభుత్వ సంస్థలు, లేదా ప్రైవేటు సంస్థలు రూ. 250 కోట్ల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ జరిమానాను రూ. 500 కోట్లకు పెంచే అధికారం త్వరలో ఏర్పాటు చేయనున్న డేటా ప్రొటెక్షన్ బోర్డ్ (Data Protection Board) కు ఉంటుంది. ఈ జరిమానా నిబంధనల ఉల్లంఘన తీవ్రత, జరిగిన అన్యాయం, జరిగిన నష్టం.. మొదలైన వాటి ఆధారంగా కేసును బట్టి నిర్ణయిస్తారు. రూ. 500 కన్నా ఎక్కువ జరిమానా విధించాల్సిన కేసులైతే.. పార్లమెంట్లో చట్టాన్ని సవరించాల్సి వస్తుంది.

ఈ వర్షాకాల సమావేశాల్లోనే..

ఈ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును త్వరలో ప్రారంభం కానున్న వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ప్రకారం.. డేటా ప్రొటెక్షన్ బోర్డ్ పూర్తిగా స్వతంత్ర సంస్థగా ఉంటుంది. ఇందులో సాధ్యమైనంత ఎక్కువమంది సబ్జెక్ట్ నిపుణులు సభ్యులుగా ఉంటారు. కొరొనో వంటి మహమ్మారులు విజృంభిస్తున్న సమయంలో, ప్రకృతి విపత్తుల సమయంలో, నేరాల దర్యాప్తు సమయాల్లో, అత్యవసర చికిత్స సమయాల్లో.. సంబంధిత ప్రభుత్వ సంస్థలు వ్యక్తిగత సమాచారం పొందడానికి వినియోగదారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. మిగతా, అన్ని సందర్బాల్లో యాప్స్, డిజిటల్ ప్లాట్ ఫామ్స్ తో సహా అందరూ యూజర్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. తమ డేటాను ఎలా సేకరిస్తున్నారు? ఎలా ఉపయోగిస్తున్నారు? ఎలా భద్రపరుస్తున్నారు?.. వంటి వివరాలను అడిగి తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉంటుంది.

తదుపరి వ్యాసం