Cyclone Mandous : దూసుకొస్తున్న మాండస్ తుపాను.. ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు!
06 December 2022, 12:00 IST
- Cyclone Mandous : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫలితంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.
దూసుకొస్తున్న మాండస్ తుపాను.. ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు!
Cyclone Mandous : బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌పై ఈ తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఫలితంగా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దూసుకొస్తున్న మాండస్ తుపాను..
ఈ తుపానుకు 'మాండస్' అని పేరు పెట్టింది యూఏఈ. అరబిక్ బాషలో మాండస్ అంటే నిధుల పెట్టె! ఈ ఏడాది బంగాళాఖాతంలో ఏర్పడనున్న రెండో తుపాను ఈ మాండస్. అక్టోబర్‌లో సిత్రంగ్ తుపాను.. బంగ్లాదేశ్‌లో బీభత్సం సృష్టించింది.
Cyclone Mandous live updates : ఇక ఇప్పుడు.. మాండస్ తుపాను ఈ నెల 8న తీరం దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. డిసెంబర్ 5న.. దక్షిణ అండమాన్ సముద్రం పరిస ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. అక్కడి నుంచి వాయువ్య- ఉత్తరంవైపు అది ప్రయాణించే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం నాటికి అల్పపీడనం మరింత తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారొచ్చు. ఆ తరువాత అక్కడి నుంచి వాయువ్య- ఉత్తరంవైపు ప్రయాణించి తుపానుగా మారవచ్చు. ఈ నెల 8 ఉదయం.. ఉత్తర తమిళనాడు- పుదుచ్చేరి మధ్యలో తుపాను తీరం దాటే అవకాశం ఉంది.
మాండస్ తుపాను వల్ల తమిళనాడు ఉత్తర- తీర ప్రాంతాలు, పుదుచ్చేరి, కరైకల్‌లో ఈ నెల 7 అర్ధరాత్రి నుంచి వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత..9 వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయి.
Cyclone Mandous in Tamil Nadu : ఈ నెల 7-9 మధ్య తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ పేర్కొంది.
"తుపాను ఏర్పడుతుంది. కానీ తీరాన్ని తాకే ముందు అది బలహీన పడిపోవచ్చు. కానీ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి," అని స్కైమెట్‌కు చెందిన మహశ్ పలావత్ తెలిపారు.
తుపానుకు రాష్ట్రలు సన్నద్ధమవుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకునేందుకు చర్యలు చేపట్టింది.