తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cuet Pg 2023 Registration: సీయూఈటీ పీజీ దరఖాస్తుకు ఈ రోజే లాస్ట్ డేట్

CUET PG 2023 registration: సీయూఈటీ పీజీ దరఖాస్తుకు ఈ రోజే లాస్ట్ డేట్

HT Telugu Desk HT Telugu

11 May 2023, 15:11 IST

    • CUET PG 2023 registration: 2023 సంవత్సరానికి గానూ సీయూఈటీ పీజీ (CUET PG 2023) కి దరఖాస్తు చేసుకోవడానికి గడువు మే 11 తో ముగుస్తుంది. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు మే 11, రాత్రి 9 గంటల లోపు cuet.nta.nic.in. వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CUET PG 2023 registration: దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాలు సహా పలు యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency, NTA) ప్రతీ సంవత్సరం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (Common University Entrance Test) నిర్వహిస్తుంటుంది.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

CUET PG 2023 registration: మే 11, రాత్రి 9 వరకే..

సీసీయూఈటీ పీజీ (CUET PG 2023) కి దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులు cuet.nta.nic.in. వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన విండో మే 9 వ తేదీన రీ ఓపెన్ అయింది. మే 11 రాత్రి 9 గంటల వరకు ఇది అందుబాటులో ఉంటుంది. అప్లికేషన్ లోని తప్పొప్పులను సరి చేసుకునే వీలు కల్పించే కరెక్షన్ విండ్ మే 12వ తేదీన ఓపెన్ అవుతుంది. మే 13 న క్లోజ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులతో పాటు, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు కూడా మళ్లీ ఫ్రెష్ గా అప్లై చేసుకోవచ్చు. సీయూఈటీ పీజీ (CUET PG 2023) పరిధిలోకి కొత్తగా మరికొన్ని యూనివర్సిటీలు వచ్చినందువల్ల ఎన్టీఏ ఈ నిర్ణయం తీసుకుంది.

CUET PG 2023 registration: ఆన్ లైన్ రిజిస్ట్రేషన్

ఈ CUET PG 2023 కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే వారు ముందుగా..

  • సీయూఈటీ (CUET) అధికారిక వెబ్ సైట్ cuet.nta.nic.in.ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీపై కనిపించే CUET PG 2023 registration లింక్ పై క్లిక్ చేయాలి.
  • అవసరమైన వివరాలను ఫిల్ చేసి, లాగిన్ కావాలి.
  • అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్ లోడ్ చేయాలి.
  • ఆన్ లైన్ లోనే అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
  • అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను, కన్ఫర్మేషన్ పేజీని డౌన్ లోడ్ చేసుకోవాలి. అలాగే, ప్రింట్ తీసి పెట్టుకోవాలి.