Cryptocurrency prices today: బిట్‌కాయిన్, డోజ్‌కాయిన్ పతనం
12 August 2022, 9:28 IST
- Cryptocurrency prices today: గ్లోబల్ క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాప్ గత 24 గంటల్లో దాదాపు 2% తగ్గి 1.19 ట్రిలియన్లకు చేరుకుంది.
స్వల్పంగా పతనమైన క్రిప్టోకరెన్సీలు
Cryptocurrency prices today: ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రజాదరణ కలిగిన క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ 2% పతనమై 23,978 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్ CoinGecko నివేదిక ప్రకారం గత 24 గంటల్లో దాదాపు 2% క్షీణించి 1.19 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.
మరోవైపు ఎథెరియం బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈథర్ నాణెం దాదాపు ఒక శాతం పెరిగి 1,894 డాలర్లకు చేరుకుంది. డోజీకాయిన్ ధర ఒక శాతం తగ్గి 0.07 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయితే షిబా ఇను కూడా స్వల్పంగా పడిపోయింది.
XRP, BNB, Litecoin, Chainlink, Tether, Polkadot, Tron, Avalanche, Stellar, Apecoin, Uniswap, Polygon తదితర క్రిప్టోకరెన్సీల ధరలు గత 24 గంటల్లో నష్టాల్లో ట్రేడవుతుండడంతో ఇతర క్రిప్టో ధరల పనితీరు కూడా క్షీణించింది. అయితే సోలానా ఒక శాతం కంటే ఎక్కువ పెరిగింది.
కేంద్రీకృత ఎక్స్ఛేంజీలలో క్రిప్టోకరెన్సీ డెరివేటివ్స్ ట్రేడింగ్ జూలైలో $3.12 ట్రిలియన్లకు పెరిగింది. నెలవారీ పెరుగుదల 13 శాతంగా నమోదైంది. క్రిప్టో ధరలు ఇటీవలి మార్కెట్ క్రాష్ నుండి రికవరీ సంకేతాలను చూపుతున్నాయని అనలిస్ట్‌లు విశ్లేషిస్తున్నారు.
డెరివేటివ్స్ మార్కెట్ ఇప్పుడు మొత్తం క్రిప్టో వాల్యూమ్‌లలో 69 శాతం మేర కలిగి ఉంది. ఇది జూన్‌లో 66 శాతంగా ఉంది.
ప్రపంచంలోనే అతిపెద్ద అసెట్ మేనేజర్ అయిన BlackRock Inc యునైటెడ్ స్టేట్స్‌లోని సంస్థాగత ఖాతాదారుల కోసం స్పాట్ బిట్‌కాయిన్ ప్రైవేట్ ట్రస్ట్‌ను ప్రారంభించిందని దాని వెబ్‌సైట్‌లోని ఒక బ్లాగ్ పోస్ట్ తెలిపింది. ఈ ట్రస్ట్ బిట్‌కాయిన్ పనితీరును ట్రాక్ చేస్తుందని బ్లాక్‌రాక్ తెలిపింది.
అధిక ద్రవ్యోల్బణం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంపుదలపై ఆందోళనల నడుమ క్రిప్టో మార్కెట్ మే, జూన్‌లలో పడిపోయింది. రిస్కీ అసెట్స్ వదులుకునేలా పెట్టుబడిదారులను ఈ పరిణామం ప్రేరేపించింది. ప్రధాన క్రిప్టో కరెన్సీల పతనం తరువాత కొంతమంది క్రిప్టోకరెన్సీ రుణదాతలు లావాదేవీలను స్తంభింపజేశాయి. కస్టమర్లు తమ సొమ్ములను వెనక్కి తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అనేక క్రిప్టో సంస్థలు ఉద్యోగాల్లో కోత విధించాయి. అయితే తిరిగి జూలైలో బిట్‌కాయిన్ 17% లాభపడటంతో ధరలు పాక్షికంగా కోలుకున్నాయి. ఈథర్ జూన్ కనిష్ట ధర 880 డాలర్ల నుండి 1,900 డాలర్లకు పెరిగింది.