తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Corona News | చైనాను మళ్లీ వణికిస్తున్న కరోనా వైరస్‌.. భారీగా కేసులు

Corona News | చైనాను మళ్లీ వణికిస్తున్న కరోనా వైరస్‌.. భారీగా కేసులు

HT Telugu Desk HT Telugu

13 March 2022, 13:36 IST

google News
    • కరోనా వైరస్‌ పుట్టిన చైనాలో ఇప్పుడు జనాలు బెంబేలెత్తుతున్నారు. కేసులు రెండేళ్ల గరిష్ఠానికి చేరడంతో మరోసారి కఠినమైన లాక్‌డౌన్లు విధిస్తున్నారు.
చైనాలో మరోసారి భారీగా నమోదవుతున్న కరోనా కేసులు
చైనాలో మరోసారి భారీగా నమోదవుతున్న కరోనా కేసులు (AP)

చైనాలో మరోసారి భారీగా నమోదవుతున్న కరోనా కేసులు

బీజింగ్‌: చైనాలో ఆదివారం కొత్తగా 3393 కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం కంటే ఇది రెట్టింపు కావడం గమనార్హం. రెండేళ్ల తర్వాత చైనాలో ఒకే రోజు ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. కేసులు భారీగా నమోదవుతుండటంతో షాంఘైలో స్కూళ్లు మూసేశారు. 

పలు ఈశాన్య నగరాల్లో లాక్‌డౌన్లు విధిస్తున్నారు. దేశంలోని 19 ప్రావిన్స్‌లలో ఒమిక్రాన్‌, డెల్టా వేరియెంట్ల కేసులు నమోదవుతున్నాయి. నిజానికి కొవిడ్‌ చైనాలోనే పుట్టినా.. అక్కడ వైరస్‌ వ్యాప్తి చెందకుండా కఠినమైన ఆంక్షలు విధించారు. జీరో కొవిడ్‌ పాలసీతో వైరస్‌ను కట్టడి చేయగలిగారు. 

అయితే తాజాగా వ్యాప్తి ఎక్కువగా ఉండే ఒమిక్రాన్‌ వేరియెంట్‌, లక్షణాలు లేని వారి సంఖ్య ఎక్కువగా ఉండటం అక్కడి అధికారులకు సవాలుగా మారింది. ఒక్క జిలిన్‌ నగరంలోనే 500 కేసులు నమోదవడంతో అక్కడ లాక్‌డౌన్‌ విధించారు. దాని పక్కనే ఉన్న చాంగ్‌చున్‌ నగరంలోనూ లాక్‌డౌన్‌ విధించడం గమనార్హం. 

జిలిన్‌ నగరంలో వైరస్‌ను కట్టడి చేయలేకపోయిన మేయర్‌, హెల్త్‌ కమిషన్‌ చీఫ్‌లను తొలగించినట్లు అక్కడి అధికార మీడియా వెల్లడించింది. జిలిన్‌ ప్రావిన్స్‌లోనే ఉన్న సైపింగ్‌, డున్‌హువా నగరాలలో కూడా పూర్తిగా లాక్‌డౌన్‌ విధించారు.

తదుపరి వ్యాసం