తెలుగు న్యూస్  /  National International  /  China Declares 'Decisive' Win Over Covid Amid Doubts Over Death Toll Data

China declares “decisive” win over Covid: కొరోనా పై విజయం సాధించాం: చైనా

HT Telugu Desk HT Telugu

17 February 2023, 22:51 IST

  • China declares “decisive” win over Covid: కొరొనా (corona) మహమ్మారిపై నిర్ణయాత్మక విజయం సాధించామని చైనా ప్రకటించింది. ప్రణాళికాబద్ధంగా తీసుకున్న నిర్ణయాల ఫలితంగా ఈ విజయం సాధ్యమైందని వెల్లడించింది. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొరొనా (corona) మహమ్మారిపై నిర్ణయాత్మక విజయం సాధించామని చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ (Communist Party China CPC) ప్రకటించింది. అత్యంత తక్కువ మరణాల రేటుతో ఈ విజయం సాధించామని, ఇదొక అద్భుతమని అభివర్ణించింది. అయితే, చైనాలో కొరోనా (corona) తో ఎంతమంది చనిపోయారనే విషయంలో అంతర్జాతీయంగా అనేక అనుమానాలున్నాయి. మరణాల సంఖ్యను చైనా తక్కువగా చూపుతోందన్న ఆరోపణలు ఉన్నాయి.

80% population infected with the virus: కొరోనా బారిన 80% ప్రజలు

ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో జీరో కోవిడ్ పాలసీ (zero-Covid policy) ని డిసెంబర్ నెలలో చైనా ఎత్తివేసింది. ఆ తరువాత నుంచి చైనాలో కొరోనా (corona) కేసుల సంఖ్య భారీగా పెరగడం ప్రారంభమైంది. ఇప్పటివరకు చైనా జనాభాలో 80% పైగా కొరోనా బారిన పడ్డారని ఒక అంచనా. చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ (Communist Party China CPC) సెంట్రల్ కమిటీ గురువారం సమావేశమై ఈ ప్రకటన చేసింది. ఆ సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అధ్యక్షత వహించారు. కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు హాజరయ్యారు. ‘అత్యధిక జనాభా కలిగిన దేశమైన చైనా కొరోనా మహమ్మారిపై విజయం సాధించడం మానవ చరిత్రలోనే ఒక అద్భుతమ’ని సీపీసీ (Communist Party China CPC) ఆ సమావేశం అనంతరం ఒక ప్రకటన జారీ చేసింది.

Corona deaths in China: మరణాలెన్ని?

అయితే, కోవిడ్ 19 (Covid-19)తో చైనాలో ఎంతమంది చనిపోయారు? ఎంతమందికి దేశవ్యాప్తంగా ఈ వైరస్ సోకిందనే విషయాలను ఈ ప్రకటనలో పేర్కొనలేదు. డిసెంబర్ 8 నుంచి ఫిబ్రవరి 9 మధ్య చైనాలో కోవిడ్ 19 (Covid-19) తో 83 వేల మంది చనిపోయారని చైనా ఇటీవల ప్రకటించింది. జీరో కోవిడ్ పాలసీ (zero-Covid policy) కారణంగా చైనా ఆర్థికంగా బాగా దెబ్బతిన్నదన్న వాదన ఉంది. కఠిన ఆంక్షల కారణంగా ప్రజల్లోనూ ఆ పాలసీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మరోవైపు, ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కొరోనా వైరస్ వ్యాప్తి దేశవ్యాప్తంగా తీవ్రమైంది.