Sasha cheetah death : అయ్యో.. నమీబియా నుంచి వచ్చిన చిరుత మృతి!
28 March 2023, 6:08 IST
Cheetah Sasha dies : కూనో నేషనల్ పార్కులో నివాసముంటున్న 20 చిరుతల్లో ఒకటి మరణించింది. ఈ సాషా చిరుత.. గతేడాది నమీబియా నుంచి ఇండియాకు వచ్చింది.
నమీబియా నుంచి తెచ్చిన చిరుత మృతి
sasha cheetah death : నమీబియా నుంచి గతేడాది ఇండియాలోకి అడుగుపెట్టిన 8 చిరుతల్లో ఒకటి మరణించింది. జనవరి నుంచి కిడ్నీ సంబంధిత వ్యధితో బాధపడుతున్న 'సాషా'.. సోమవారం తుదిశ్వాస విడిచింది. మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్కులో నివాసముంటున్న సాషా.. రోజువారీ పరీక్షల్లో చాలా బలహీనంగా కనిపించింది. వైద్యపరీక్షలు నిర్వహించగా.. చిరుతకు డీహైడ్రేషన్ అవుతోందని, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నాయని తేలింది.
7 చిరుతలు సేఫ్..!
చిరుతకు నిర్వహించిన రక్త పరీక్షలో.. క్రియాటినైన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు గమనించారు. ఇది కిడ్నీ సమస్యకు సంకేతామని తెలుసుకున్నారు. అయితే.. పార్కులోని ఇతర చిరుతలు ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలుస్తోంది.
cheetah Sasha dies : దేశంలో చిరుతలు అంతరించిపోయాయి దశాబ్దాలు గడిచిపోయింది. దేశంలోని చివరి చిరుతపులి 1947లో మరణించింది. 1952లో ఈ చిరుతను అంతరించిపోయిన జాతిగా గుర్తించారు. దశాబ్దాల తర్వాత గతేడాది సెప్టెంబర్‌లో 8 చిరుతలు దేశంలోకి అడుగుపెట్టాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన (సెప్టెంబర్ 17) సందర్భంగా వాటిని పార్కులోకి విడుదల చేశారు. ఎనిమిదింట్లో.. 5 ఆడ, 3 మగ చిరుతలు ఉన్నాయి. సాషాతో పాటు మరో చిరుత వయస్సు 5ఏళ్లు.
ఈ 8 చిరుతలను తొలుత క్వారంటైన్లో ఉంచారు. ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వచ్చారు. అనంతరం ఒక్కొక్కటిగా అడవుల్లో వదలడం మొదలుపెట్టారు. గత వారమే.. ఎల్టాన్, ఫ్రెడ్డీ అనే చిరుతలను క్వారంటైన్ నుంచి అడవుల్లోకి వదిలారు.
Kuno National park Cheetahs : ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో 12 చిరుతులను కూనో నేషనల్ పార్కుకు తీసుకొచ్చారు. ఈ 12లో 7 మగ, 5 ఆడ చిరుతలు ఉన్నాయి. రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, పర్యావరణశాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌లు.. వీటిని కూనో నేషనల్ పార్క్‌లో|ని క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లో విడిచిపెట్టారు. ఇవన్నీ దక్షిణాఫ్రికా నుంచి వచ్చినవే. వీటితో కలుపుకుని.. కూనో నేషనల్ పార్కులో మొత్తం 20 చిరుతలు ఉన్నట్టు. వీటిల్లో ఒకటి మరణించింది.
టాపిక్