తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  China New Virus : చైనాలో ఆరోగ్య విపత్తు వేళ రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు!

China new virus : చైనాలో ఆరోగ్య విపత్తు వేళ రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు!

Sharath Chitturi HT Telugu

26 November 2023, 23:28 IST

google News
    • China new virus : చైనాలో ఆరోగ్య విపత్తు వేళ రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలిచ్చింది. ఆసుపత్రుల్లో వసతులను సమీక్షించాలని వెల్లడించింది.
చైనాలో ఆరోగ్య విపత్తు వేళ రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు!
చైనాలో ఆరోగ్య విపత్తు వేళ రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు! (HT_PRINT)

చైనాలో ఆరోగ్య విపత్తు వేళ రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు!

China new virus : చైనాలో అంతుచిక్కని వ్యాధి అంతకంతకు విస్తరిస్తున్న వేళ భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని, పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని కేంద్రం వెల్లడించింది.

చైనాలో ఉపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి వ్యాప్తిచెందుతోంది. ఇది కొత్త రకమైన నిమోనియాగా అక్కడి వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఇండియాలో ఆరోగ్య వ్యవస్థను రివ్యూ చేసే పనిలో పడింది కేంద్రం. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సైతం ఆదేశాలిచ్చింది. ప్రజా ఆరోగ్య వ్యవస్థ, ఆసుపత్రుల్లో సౌకర్యాలను వెంటనే పరిశీలించాలని తెలిపింది. మానవ వనరులతో పాటు ఆసుపత్రుల్లో బెడ్లు, అవసరమైన ఔషధాలు, మెడికల్​ ఆక్సీజెన్​, పీపీఈ కిట్లు, యాంటీబయాటిక్స్​, టెస్టింగ్​ కిట్లు వంటివి ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని స్పష్టం చేసింది.

India on China new virus : వీటితో పాటు.. హెల్త్​కేర్​ ఫెసిలిటీల్లో.. ఆక్సీజెన్​ ప్లాంట్​లు, వెంటిలేటర్లు నిరంతరం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెప్పింది భారత ప్రభుత్వం. అంతేకాకుండా.. వ్యాధులు సోకకుండా, వ్యాప్తి చెందకుండా.. కంట్రోల్​ ప్రోటోకాల్స్​ని సైతం సిద్ధంగా ఉంచాలని సూచించింది.

"శీతాకాలంలో ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. భారత దేశ ప్రభుత్వం ఈ పరిస్థితులను నిరంతర పర్యవేక్షిస్తోంది. భయపడాల్సిన అవసరం లేదు," అని కేంద్రం వెల్లడించింది.

China pneumonia cases : కొన్నే ఏళ్ల క్రితం.. ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్​-19 పుట్టింది చైనాలోనే! కొవిడ్​ దెబ్బకు ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ సమయంలో.. చైనాలో మరో వ్యాధి వ్యాప్తిచెందుతోందన్న వార్తలు ప్రపంచాన్ని భయపెడుతోంది. అక్కడ నిమోనియా కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా విద్యాసంస్థల ద్వారా ఈ వ్యాధి.. ఒకరి నుంచి మరొకరికి వేగంగా పాకుతోంది. ఫలితంగా.. ఉత్తర చైనాలో రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడిపోతున్నాయి. చాలా చోట్ల ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే దశలో ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే.. ఇది కొత్త వైరస్​ కాదని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చైనా చెబుతోంది. కొన్ని గుర్తించిన పాథోజెన్స్​ కలయికతోనే ఈ కొత్త నిమోనియా పుట్టుకొచ్చిందని అంటోంది. కానీ.. ఒకేసారి ఇంత భారీ స్థాయిలో కేసులు వెలుగులోకి రావడంతో డబ్ల్యూహెచ్​ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) ఆందోళన వ్యక్తం చేసింది. తాజా వ్యాధిపై మరింత సమాచారం అందివ్వాలని చైనాకు చెప్పింది.

తదుపరి వ్యాసం