తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cbse 12th Result 2022: సీబీఎస్ఈ క్లాస్ 12 ఫలితాల డైరెక్ట్ లింక్స్ ఇవిగో

CBSE 12th result 2022: సీబీఎస్ఈ క్లాస్ 12 ఫలితాల డైరెక్ట్ లింక్స్ ఇవిగో

HT Telugu Desk HT Telugu

22 July 2022, 12:33 IST

google News
    • CBSE Class 12th result 2022: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలను సీబీఎస్ఈ బోర్డు విడుదల చేసింది. ఫలితాలను ఈ కింది లింక్స్ ద్వారా తెలుసుకోండి.
సీబీఎస్ఈ క్లాస్ 12 ఫలితాాల విడుదల
సీబీఎస్ఈ క్లాస్ 12 ఫలితాాల విడుదల

సీబీఎస్ఈ క్లాస్ 12 ఫలితాాల విడుదల

CBSE 12th result 2022: సీబీఎస్ఈ క్లాస్ 12 టెర్మ్ 2 పరీక్ష ఫలితాలను సీబీఎస్ఈ బోర్డు విడుదల చేసింది. సీబీఎస్ఈ బోర్డు అందించిన సమాచారం ప్రకారం, 92.71% మంది విద్యార్థులు సీబీఎస్ఈ 12 బోర్డు పరీక్ష 2022 లో ఉత్తీర్ణులయ్యారు. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి జూన్ 15 వరకు జరిగాయి.

బాలికల ఉత్తీర్ణత శాతం 94.54 శాతం కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 91.25 శాతంగా ఉంది. కేరళ రాష్ట్రం ఈసారి అత్యధిక ఉత్తీర్ణత సాధించింది. 98.83 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

సీబీఎస్ఈ ఫలితాలను ఈ కింది సైట్స్ ద్వారా తెలుసుకోవచ్చు. 12వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి విద్యార్థులు కనీసం 33% స్కోరు సాధించాలి.

CBSE Class 12th result 2022:

ఐవీఆర్ఎస్ పద్ధతిలో ఫలితాలు ఇలా..

CBSE 12th result 2022: సీబీఎస్ఈ 12 వ తరగతి విద్యార్థులు ఐవిఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) సిస్టమ్ ద్వారా రోల్ నంబర్ ఇచ్చి తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.

సిబిఎస్ఇ 12 వ తరగతి విద్యార్థులు వారి స్కోర్ కార్డు తెలుసుకోవడానికి రోల్ నంబర్, పుట్టిన తేదీ ఇచ్చి ఈ కింది ఐవిఆర్ ఎస్ నెంబర్‌లో మార్కులు తెలుసుకోవచ్చు.

ఢిల్లీ విద్యార్థులు చేయాల్సిన నెంబర్: 24300699

భారతదేశంలోని ఇతర ప్రాంతాల విద్యార్థులు చేయాల్సిన ఫోన్ నెంబర్: 011- 24300699

స్కోర్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవడం ఇలా..

CBSE 12th result 2022: విద్యార్థులు తమ రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేసి స్కోర్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

స్టూడెంట్స్ మార్క్ షీట్స్ డౌన్ లోడ్ చేసుకునేందుకు కింది స్టెప్స్ అనుసరించాలి.

స్టెప్ 1: ఈ సైట్ సందర్శించండి -- cbseservices.digilocker.gov.in/activatecbse

స్టెప్ 2: 'గెట్ స్టార్ట్ విత్ అకౌంట్ కన్ఫర్మేషన్' లింక్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 3: క్లాస్ 12 ఎంచుకోండి. మీ స్కూల్ కోడ్, రోల్ నంబర్, ఆరు అంకెల సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయండి.

స్టెప్ 4: 'నెక్ట్స్' ట్యాబ్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబరును సబ్మిట్ చేయండి.

స్టెప్ 5: మొబైల్ లో అందుకున్న ఓటీపీని ఎంటర్ చేయండి

స్టెప్ 6: ఇప్పుడు 'ఇష్యూడ్ డాక్యుమెంట్స్ సెక్షన్'కు వెళ్లి డిజిటల్ మార్క్ షీట్ డౌన్ లోడ్ చేసుకోండి.

Cbse class 12 results: డిజిలాకర్ నుంచి మార్క్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?

స్టెప్ 1: గూగుల్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ (ఐఓఎస్ కోసం) నుంచి డిజిలాకర్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

స్టెప్ 2: 'యాక్సెస్ డిజిలాకర్' పై క్లిక్ చేయండి

స్టెప్ 3: సీబీఎస్ఈలో రిజిస్టర్ అయిన మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి

స్టెప్ 4: మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి

స్టెప్ 5: యాక్సెస్ సీబీఎస్‌ఈ మార్క్ షీట్, సర్టిఫికేట్

వెయిటేజీ ఇలా..

CBSE 12th result 2022: ఈ సంవత్సరం బోర్డు రెండు టర్మ్‌లలో పరీక్షలు నిర్వహించింది. అంటే టర్మ్ 1 పరీక్షలకు 30 శాతం వెయిటేజీ, టర్మ్ 2కి 70 శాతం వెయిటేజీ ఇస్తారు. 2022 టర్మ్ 1, 2 పరీక్షల్లో మార్కుల వెయిటేజీ ఆధారంగా సీబీఎస్ఈ ఫైనల్ మార్క్ షీట్ తయారు చేస్తారు.

ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కులు, ప్రాజెక్ట్ వర్క్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్, ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్ వంటి అకడమిక్ ఇయర్లో సాధించిన మార్కుల వివరాలు 12వ తరగతి మార్కుల షీట్‌లో ఉంటాయి.

CBSE 12th result 2022: కంపార్ట్మెంట్ ఎగ్జామ్

కంపార్ట్మెంట్ కేటగిరీలో ఉన్న విద్యార్థులు ఆగస్టు 23, 2022న పరీక్షకు హాజరవ్వొచ్చు. సీబీఎస్ఈ 12 వ తరగతి కంపార్ట్మెంట్ పరీక్ష టర్మ్ 2 పరీక్ష సిలబస్ ఆధారంగా ఉంటుంది.

CBSE 12th result 2022: రీ-ఎవాల్యుయేషన్ ప్రక్రియ

సీబీఎస్ఈ బోర్డు విద్యార్థులు వారి మార్కులను వెరిఫై చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. దీనికి సంబంధించి బోర్డు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది.

95 శాతానికి పైగా స్కోరు చేసిన విద్యార్థులు

33,000 మంది విద్యార్థులు 95 శాతానికి పైగా స్కోర్ చేయగా, 1.34 లక్షల మంది 90 శాతానికి పైగా సాధించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 2021లో 99.37 శాతం కాగా ఈ ఏడాది 92.71 శాతంగా ఉంది.

మొత్తం 1435366 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1330662 మంది ఉత్తీర్ణులయ్యారు.

కేరళలోని తిరువనంతపురం అత్యధికంగా 98.83 శాతం ఉత్తీర్ణత సాధించగా, బెంగళూరు 98.16 శాతం, చెన్నై 97.79 శాతం, ఢిల్లీ ఈస్ట్, ఢిల్లీ వెస్ట్ 96.29 శాతం ఉత్తీర్ణత సాధించాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ అత్యల్పంగా 83.71 శాతం ఉత్తీర్ణత సాధించింది.

టాపిక్

తదుపరి వ్యాసం