తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cbse Class 12 Compartment Results 2023: సీబీఎస్ఈ క్లాస్ 12 కంపార్ట్ మెంట్ రిజల్ట్ విడుదల; ఇలా చెక్ చేసుకోండి

CBSE Class 12 Compartment results 2023: సీబీఎస్ఈ క్లాస్ 12 కంపార్ట్ మెంట్ రిజల్ట్ విడుదల; ఇలా చెక్ చేసుకోండి

HT Telugu Desk HT Telugu

01 August 2023, 17:38 IST

google News
  • CBSE Class 12 Compartment results 2023: క్లాస్ 12 కంపార్ట్ మెంట్ ఫలితాలను సీబీఎస్ఈ (CBSE) మంగళవారం విడుదల చేసింది. ఫలితాలను, స్కోర్ కార్డ్స్ ను విద్యార్థులు results.cbse.nic.in. లేదా cbseresults.nic.in  వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CBSE Class 12 Compartment results 2023: 12వ తరగతి కంపార్ట్ మెంట్ పరీక్షల ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) మంగళవారం విడుదల చేసింది. ఆ పరీక్షలు రాసిన విద్యార్థులు results.cbse.nic.in. లేదా cbseresults.nic.in వెబ్ సైట్స్ లో తమ ఫలితాలను, స్కోర్ కార్డ్స్ ను చెక్ చేసుకోవచ్చు. ఆ వెబ్ సైట్స్ లో విద్యార్థులు తమ రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీలను నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అలాగే, తమ స్కోర్ కార్డ్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 12వ తరగతి కంపార్ట్ మెంట్ థీయరీ ఎగ్జామ్ ను సీబీఎస్ఈ జులై 17వ తేదీన నిర్వహించింది. మొదట జరిగిన మెయిన్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు ఈ కంపార్ట్ మెంట్ పరీక్ష ద్వారా సీబీఎస్ఈ మరో అవకాశం కల్పించింది. పదవ తరగతి విద్యార్థులకు కూడా ఈ కంపార్ట్మెంట్ పరీక్ష అవకాశం ఉంది. వారికి జులై 17 నుంచి జులై 22 వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాలు త్వరలో వెలువడనున్నాయి.

how to check: ఫలితాలను చెక్ చేసుకోవడం ఎలా?

సీబీఎస్ఈ 12వ తరగతి కంపార్ట్మెంట్ పరీక్ష రాసిన విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవడానికి ముందుగా..

  • results.cbse.nic.in. లేదా cbseresults.nic.in వెబ్ సైట్స్ లో ఏదైనా ఒక వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీపై కనిపించే CBSE Class 12 Compartment examination result లింక్ పై క్లిక్ చేయాలి.
  • నిర్ధారిత బాక్స్ ల్లో రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీలను నమోదు చేయాలి.
  • స్క్రీన్ పై రిజల్ట్, స్కోర్ కార్డ్ కనిపిస్తుంది.
  • రిజల్ట్ ను చెక్ చేసుకుని, స్కోర్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం వాటిని సేవ్ చేసి పెట్టుకోవాలి. అలాగే, ఒక కాపీని ప్రింట్ తీసుకుని భద్రపర్చుకోవాలి.

తదుపరి వ్యాసం