CBSE 10 Compartment results: సీబీఎస్ఈ టెంత్ క్లాస్ సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చేశాయి.. మీ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
04 August 2023, 14:33 IST
CBSE Class 10 Compartment results 2023: క్లాస్ 10 సప్లిమెంటరీ (కంపార్ట్ మెంట్ + ఇంప్రూవ్ మెంట్) ఫలితాలను సీబీఎస్ఈ (CBSE) శుక్రవారం విడుదల చేసింది. ఫలితాలను, స్కోర్ కార్డ్స్ ను విద్యార్థులు results.cbse.nic.in, cbseresults.nic.in. వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
ప్రతీకాత్మక చిత్రం
CBSE Class 10 Compartment results 2023: క్లాస్ 10 సప్లిమెంటరీ (కంపార్ట్ మెంట్ + ఇంప్రూవ్ మెంట్) ఫలితాలను సీబీఎస్ఈ (CBSE) శుక్రవారం విడుదల చేసింది. ఫలితాలను, స్కోర్ కార్డ్స్ ను విద్యార్థులు results.cbse.nic.in, cbseresults.nic.in. వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
కంపార్ట్మెంట్, ఇంప్రూవ్మెంట్..
CBSE Class 10 Compartment results 2023: 10వ తరగతి కంపార్ట్ మెంట్, ఇంప్రూవ్ మెంట్ పరీక్షల ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) శుక్రవారం విడుదల చేసింది. ఆ పరీక్షలు రాసిన విద్యార్థులు results.cbse.nic.in. లేదా cbseresults.nic.in వెబ్ సైట్స్ లో తమ ఫలితాలను, స్కోర్ కార్డ్స్ ను చెక్ చేసుకోవచ్చు. ఆ వెబ్ సైట్స్ లో విద్యార్థులు తమ రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీలను నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అలాగే, తమ స్కోర్ కార్డ్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 10వ తరగతి కంపార్ట్ మెంట్, ఇంప్రూవ్ మెంట్ పరీక్షలను జులై 17 నుంచి జులై 22 వరకు నిర్వహించారు. మొదట జరిగిన మెయిన్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు, పాస్ అయినప్పటికీ, ఆశించినన్ని మార్కులు రాని విద్యార్థులకు ఈ కంపార్ట్ మెంట్ పరీక్ష ద్వారా సీబీఎస్ఈ మరో అవకాశం కల్పించింది. క్లాస్ 12 కంపార్ట్ మెంట్ ఫలితాలను సీబీఎస్ఈ ఇప్పటికే ప్రకటించింది.
how to check: ఫలితాలను చెక్ చేసుకోవడం ఎలా?
సీబీఎస్ఈ 10వ తరగతి కంపార్ట్మెంట్ పరీక్ష రాసిన విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవడానికి ముందుగా.
- results.cbse.nic.in. లేదా cbseresults.nic.in వెబ్ సైట్స్ లో ఏదైనా ఒక వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
- హోం పేజీపై కనిపించే CBSE Class 10 Compartment examination result లింక్ పై క్లిక్ చేయాలి.
- నిర్ధారిత బాక్స్ ల్లో రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీలను నమోదు చేయాలి.
- స్క్రీన్ పై రిజల్ట్, స్కోర్ కార్డ్ కనిపిస్తుంది.
- రిజల్ట్ ను చెక్ చేసుకుని, స్కోర్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
- భవిష్యత్ అవసరాల కోసం వాటిని సేవ్ చేసి పెట్టుకోవాలి. అలాగే, ఒక కాపీని ప్రింట్ తీసుకుని భద్రపర్చుకోవాలి.
- Direct link to check CBSE Class 10 Compartment result 2023