CASB Result 2023: సీఏఎస్బీ ‘అగ్నివీర్ వాయు’ ఫేజ్ 2 అడ్మిట్ కార్డ్స్ రెడీ..
15 February 2023, 14:45 IST
- CASB Result 2023: భారతీయ వైమానిక దళం (Indian Air Force IAF) లోకి అగ్నివీరులను రిక్రూట్ చేసుకునే సీఏఎస్భీ (CASB) పరీక్షకు సంబంధించిన ఫేజ్ 1 (CASB phase 1 Result 2023) ఫలితాలు వెలువడ్డాయి. అలాగే, ఫేజ్ 2 అడ్మిట్ కార్డ్స్ (CASB Phase 2 admit cards) ను కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (Indian Air Force IAF) జారీ చేసింది.
ప్రతీకాత్మక చిత్రం
Indian Air Force సెంట్రల్ ఎయిర్మెన్ సెలెక్షన్ బోర్డ్ (Central Airmen Selection Board CASB) నిర్వహించే అగ్నివీరుల రిక్రూట్ మెంట్ పరీక్ష ఫేజ్ 1 (IAF Agniveervayu 01/2023) ఫలితాలు (CASB phase 1 Result 2023) వెలువడ్డాయి. ఈ ఫలితాలను అభ్యర్థులు ఈ పరీక్ష (CASB phase 1 Result 2023)కు సంబంధించిన అధికారిక వెబ్ సైట్ agnipathvayu.cdac.in లో చెక్ చేసుకోవచ్చు. తమ ఫలితాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈమెయిల్ ఐడీ, పాస్ వర్డ్ తో లాగిన్ అయిన తరువాత హోం పేజీలో ఉన్న లింక్ ను క్లిక్ చేయడం ద్వారా ఫలితాలున్న (CASB phase 1 Result 2023) పీడీఎఫ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు
CASB Result 2023: ఫిబ్రవరి 23 వరకు అడ్మిట్ కార్డ్స్
ఈ CASB Agniveervayu 01/2023 ఫేజ్ 1 (Phase 1) పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఫేజ్ 2 (Phase 2) పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ ఫేజ్ 2 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ (CASB Phase 2 admit cards) అధికారిక వెబ్ సైట్ agnipathvayu.cdac.in లో అందుబాటులో ఉన్నాయి. వాటిని ఫిబ్రవరి 23 లోపు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడీ, పాస్ వర్డ్ తో agnipathvayu.cdac.in వెబ్ సైట్ లో లాగిన్ అయిన తరువాత హోం పేజీలో ఉన్న లింక్ ను క్లిక్ చేసి, అదనపు వివరాలను సబ్మిట్ చేయడం ద్వారా అడ్మిట్ కార్డ్ (CASB Phase 2 admit cards) ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
CASB Result 2023: ఇవి తప్పని సరి..
అడ్మిట్ కార్డ్ పై ఫేజ్ 2 (IAF Agniveer Phase 2 2023) పరీక్ష తేదీ, సమయం ఉంటాయి. ఫేజ్ 1 పరీక్ష ఉత్తీర్ణులై, ఈ ఫేజ్ 2 పరీక్షకు హాజరయ్యే అర్హులైన అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి అడ్మిట్ కార్డ్ (CASB Phase 2 admit cards) తో పాటు ఈ కింది వాటిని కూడా తప్పని సరిగా తీసుకువెళ్లాలి.
- ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ అనంతరం డౌన్ లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఫాం కలర్ ప్రింటౌట్.
- హెచ్ బీ పెన్సిల్, ఇరేజర్, షార్పెనర్, గ్లూ స్టిక్, స్టేప్లర్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్.
- అటెస్ట్ చేయని 8 పాస్ పోర్ట్ సైజ్ కలర్ ఫొటోలు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో అప్ లోడ్ చేసిన ఫొటోనే తీసుకువెళ్లాలి. వేరే ఫొటోలను అనుమతించరు.
- 10వ తరగతి పాస్ ఒరిజినల్ సర్టిఫికెట్ తో పాటు, నాలుగు సెల్ఫ్ అటెస్టెడ్ 10వ తరగతి సర్టిఫికెట్ (matriculation passing certificate) ఫొటో కాపీలు. అభ్యర్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీని వెరిఫై చేయడం కోసం ఇవి అవసరం.
- 10వ తరగతి పాస్ ఒరిజినల్ సర్టిఫికెట్ తో పాటు, మూడేళ్ల డిప్లోమా కోర్సులో ఇంగ్లీష్ సబ్జెక్టుగా లేని వారు అదనంగా మరో నాలుగు సెల్ఫ్ అటెస్టెడ్ 10వ తరగతి సర్టిఫికెట్ (matriculation passing certificate) ఫొటో కాపీలు తీసుకువెళ్లాలి.
- ఇంటర్మీడియెట్ (Intermediate/10+2/equivalent examination) పాస్ ఒరిజినల్ సర్టిఫికెట్ తో పాటు నాలుగు సెల్ఫ్ అటెస్టెడ్ ఇంటర్మీడియెట్ సర్టిఫికెట్ (Intermediate/10+2/equivalent examination) ఫొటో కాపీలు.