తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Kisan: పీఎం కిసాన్ లబ్ధి రూ. 9 వేలకు పెరగనుందా?

PM Kisan: పీఎం కిసాన్ లబ్ధి రూ. 9 వేలకు పెరగనుందా?

HT Telugu Desk HT Telugu

29 January 2024, 17:44 IST

google News
    • ఈటీ రిపోర్ట్ ప్రకారం పీఎం కిసాన్ పథకం లబ్ధిని కేంద్రం సుమారు 50 శాతం, అంటే ఇప్పుడిస్తున్న రూ. 6 వేలను రూ .9000 కు పెంచనున్నట్టు తెలుస్తోంది.
ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (HT File)

ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి సహా వారి సంక్షేమ పథకంలో కేంద్రం కొన్ని మార్పులు చేస్తుందని భావిస్తున్నారు.

మధ్యంతర బడ్జెట్‌లో ఎటువంటి జనాకర్షణ ప్రకటనలు ఉండకపోవచ్చు. అయితే ప్రభుత్వం ఈ సంవత్సరం పిఎం కిసాన్ యోజన పథకం లబ్ధిని 50 శాతం పెంచవచ్చు. అంటే ఇది సంవత్సరానికి రూ. 6000 నుండి రూ . 9000 కు పెరుగుతుంది.

కేంద్ర బడ్జెట్ 2024లో ఆశించే మూడు ప్రధాన సామాజిక రంగ ప్రకటనలలో రైతుల కోసం పీఎం కిసాన్ పథకంలో చెల్లింపుల పెరుగుదల ఒకటి అని ఆర్థికవేత్తలు భావిస్తున్నారని ఈటీ రిపోర్ట్ తెలిపింది.

2024 బడ్జెట్ సమర్పణ సమయంలో కేంద్రం గృహనిర్మాణ పథకం - పీఎం ఆవాస్ యోజనపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించనుందని ఆర్థికవేత్తలు ఒక పోల్ సందర్భంగా చెప్పారు.

గత ఏడాది బడ్జెట్ ప్రకారం పీఎం కిసాన్ పథకానికి రూ. 60,000 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది ఇది 50 శాతం పెరిగే అవకాశం ఉంది. సంక్షేమ పథకాలతో పాటు, అన్ని రంగాల్లో ప్రైవేట్ రంగ పెట్టుబడులు ఇంకా పుంజుకోనందున మూలధన వ్యయానికి కేంద్రం ఊతమివ్వాలని భావిస్తున్నారు.

రోడ్లు, ఓడరేవులు, విద్యుత్ ప్లాంట్లపై ఖర్చుకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం గత మూడేళ్లలో ఏటా మూడింట ఒక వంతు మూలధన వ్యయాన్ని పెంచింది. రాబోయే బడ్జెట్ 2024 సమావేశాల్లో ఈ రంగాలు కూడా ఊపందుకుంటాయని భావిస్తున్నారు.

బడ్జెట్ 2024కు ముందు అఖిలపక్ష సమావేశం

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అధ్యక్షతన మంగళవారం మధ్యంతర బడ్జెట్ 2024 సమర్పణకు ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

ప్రతి సమావేశాలకు ముందు వివిధ పార్టీల నాయకులు తాము లేవనెత్తాలనుకుంటున్న అంశాలను పార్లమెంటులో హైలైట్ చేయడం, ప్రభుత్వం తమ ఎజెండాను వారికి వివరించి వారి సహకారాన్ని కోరడం ఆనవాయితీగా వస్తోంది.

ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడతారని, లోక్‌సభ ఎన్నికలు, కొత్త కేబినెట్ నియామకం తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరానికి పూర్తి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు.

(ఏజెన్సీల సమాచారంతో)

తదుపరి వ్యాసం