తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bones In Veg Biryani: వెజ్ బిర్యానీలో ఎముకలు.. రెస్టారెంట్ ఓనర్‌పై కేసు

Bones in Veg Biryani: వెజ్ బిర్యానీలో ఎముకలు.. రెస్టారెంట్ ఓనర్‌పై కేసు

28 December 2022, 11:46 IST

google News
    • Bones in Veg Biryani: వెజ్ బిర్యానీలో ఎముకలు రావటంతో ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెస్టారెంట్ యజమానిపై కేసు నమోదైంది. పూర్తి వివరాలు ఇవే.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Bones in Veg Biryani: ఓ వ్యక్తి రెస్టారెంట్‍కు వెళ్లి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశారు. అతడికి బిర్యానీ సర్వ్ చేశారు హోటల్ సిబ్బంది. అయితే ఆ ప్లేట్లో ఎముకలు కనిపించాయి. దీంతో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్‍లోని ఇండోర్‌లో జరిగింది ఈ ఘటన. ఈ విషయంలో రెస్టారెంట్ యజమానిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. వివరాలివే..

ఇదీ జరిగింది

Bones in Veg Biryani: ఇండోర్‌లోని విజయా నగర్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‍కు ఆకాశ్ దూబే అనే వ్యక్తి వెళ్లారు. వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే సిబ్బంది తనకు ఇచ్చిన బిర్యానీలో ఎముకలు కనిపించే సరికి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెస్టారెంట్ మేనేజర్, సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు ఆకాశ్ దూబేకు క్షమాపణ చెప్పారు.

ఆ తర్వాత ఈ విషయంపై ఇండోర్ పరిధిలోని విజయా నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆకాశ్ దూబే. దీంతో శాకాహారికి మాంసాహారం ఇచ్చిందుకు రెస్టారెంట్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

“298 సెక్షన్ కింద రెస్టారెంట్ యజమాని స్వప్నిల్‌పై విజయా నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం ఈ విషయంపై ఇంకా దర్యాప్తు జరుగుతోంది. ఇది పూర్తయ్యాక చర్యలు తీసుకుంటాం” అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంపత్ ఉపాధ్యాయ్.. న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకు చెప్పారు.

తదుపరి వ్యాసం