Gujarat Exit Poll Results 2022: గుజరాత్లో మళ్లీ బీజేపీకే పట్టం.. వరుసగా ఏడోసారి!: ఎగ్జిట్ పోల్స్
05 December 2022, 21:16 IST
- Gujarat Exit Poll Results 2022: గుజరాత్‍లో బీజేపీ మరోసారి అధికారం చేజిక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ముక్తకంఠంతో వెల్లడించాయి. ఆ రాష్ట్రంలో వరుసగా ఏడోసారి కమలానిదే విజయమని తేల్చాయి. ఆమ్‍ఆద్మీ అంచనాలను అందుకోలేకపోయిందని వెల్లడించాయి.
Gujarat Exit Poll Results 2022: గుజరాత్‍లో మళ్లీ బీజేపీకే పట్టం.. వరుసగా ఏడోసారి: ఎగ్జిట్ పోల్స్
Gujarat Exit Poll Results 2022: గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ (BJP) మరోసారి సత్తాచాటుతుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. 27 సంవత్సరాలుగా గుజరాత్‍ను పాలిస్తున్న కమలం పార్టీ.. మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కషాయ దళానిదే విజయమని తేల్చేశాయి. నేటి (డిసెంబర్ 5) సాయంత్రం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. 182 స్థానాలు ఉన్న గుజరాత్లో అధికారం దక్కాలంటే.. 92 సీట్లు గెలవాలి. ఈ ఆధిక్యాన్ని సులువుగా దాటేసి.. బీజేపీ వరుసగా ఏడో సారి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ఏ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. ఎలా ఉన్నాయో చూడండి.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్
న్యూస్ ఎక్స్ - జన్ కీ బాత్ Exit polls
- బీజేపీ: 117-140
- కాంగ్రెస్: 34-51
- ఆమ్ఆద్మీ: 6-13
- ఇతరులు: 1-2
పీపుల్స్ పల్స్ Exit polls
- బీజేపీ: 125-143
- కాంగ్రెస్: 30-48
- ఆమ్ఆద్మీ: 03-07
- ఇతరులు: 02-06
టీవీ9 నెట్‍వర్క్ Exit polls
- బీజేపీ: 125-130
- కాంగ్రెస్: 40-50
- ఆమ్ఆద్మీ: 03-05
- ఇతరులు: 03-07
రిపబ్లిక్ పీ-మార్క్యూ Exit polls
- బీజేపీ: 128-148
- కాంగ్రెస్: 30-42
- ఆమ్ఆద్మీ: 2-10
- ఇతరులు: 0-3
ఏబీపీ-సీ ఓటర్ Exit polls
- బీజేపీ: 128-140
- కాంగ్రెస్: 31-43
- ఆమ్ఆద్మీ: 3-11
- ఇతరులు: 2-3
టైమ్స్ నౌ- ఈటీజీ Exit polls
- బీజేపీ: 139
- కాంగ్రెస్: 30
- ఆమ్ఆద్మీ: 11
- ఇతరులు: 2
జీ న్యూస్-బీఏఆర్సీ Exit polls
- బీజేపీ: 110-125
- కాంగ్రెస్: 45-50
- ఆమ్ఆద్మీ: 1-5
- ఇతరులు: 0-4
128 స్థానాలు ఉన్న గుజరాత్ శాసనసభకు రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. తొలి దశ ఈనెల 1వ తేదీన, తుది దశ నేడు (డిసెంబర్ 5) జరిగింది. ఈనెల 8వ తేదీన ఫలితాలు వెలువడతాయి.
గుజరాత్‍లో 15 రోజుల వ్యవధిలో ప్రధాని నరేంద్ర మోదీ.. 30పైగా సభల్లో పాల్గొన్నారు. మరోసారి బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. దీంతో మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‍లో ఆ రాష్ట్ర ప్రజలు బీజేపీకే పట్టం కట్టారని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
మరోవైపు, ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోలేకపోయిన కాంగ్రెస్ రెండో స్థానానికే పరిమితమవుతుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. ఎన్నో అంచనాల మధ్య అడుగుపెట్టిన ఆమ్ఆద్మీ పార్టీ మూడో స్థానంలో ఉంటుందని వెల్లడించాయి. అయితే ఆశించిన స్థాయిలో కేజ్రీవాల్ పార్టీ ఫలితాలను రాబట్టలేదని సంకేతాలు ఇచ్చాయి.