Bitcoin crash: బిట్‌కాయిన్ మళ్లీ నేల చూపులు.. క్రిప్టోకరెన్సీ మార్కెట్ల పతనం..
19 September 2022, 15:53 IST
- Bitcoin crash: క్రిప్టో కరెన్సీ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. బిట్‌కాయిన్ మరోసారి నేలచూపులు చూస్తోంది.
Bitcoin crash: మళ్లీ నేలచూపులు చూస్తున్న బిట్‌కాయిన్, ఇతర క్రిప్టోకరెన్సీ
క్రిప్టోకరెన్సీ మార్కెట్ పతనం కారణంగా ప్రధాన క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ 2020 నాటి అత్యల్ప స్థాయికి పడిపోయింది. ఈ వారం యూరప్ నుండి యుఎస్ వరకు సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ 7.4% మేర పడిపోయింది. ఆగస్టులో భారీగా పడిపోయిన క్రిప్టోకరెన్సీలు తిరిగి క్రమంగా పుంజుకున్నాయి. ఇప్పుడు మళ్లీ ఫెడ్ రేట్ల పెంపు భయాల మధ్య తిరిగి పతనం అవుతున్నాయి.
లండన్‌లో ఈ ఉదయం 7:45 గంటలకు $18,370 వద్ద ట్రేడవుతోంది. ఈథర్ 6.6% వరకు పడిపోయింది. $1,300 మార్క్ వద్ద స్థిరపడడానికి ప్రయత్నిస్తోంది. XRP, Polkadot వంటి క్రిప్టో కరెన్సీలు భారీ నష్టాలను నమోదు చేశాయి.
ద్రవ్యోల్భణాన్ని అదుపులో పెట్టేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం వడ్డీ రేట్లను భారీగా పెంచనున్నట్టు పెట్టుబడిదారులు అంచనా వేస్తున్నారు. రుణాలపై అధిక వడ్డీ క్రిప్టో రంగం లిక్విడిటీని తగ్గిస్తుంది. ఇక యూఎస్ ఈక్విటీ ఫ్యూచర్స్ రెడ్ మార్క్‌లో ఉండగా, డాలర్ గేజ్ కూడా అధిక స్థాయికి చేరింది.
ఇలాంటి ద్రవ్యోల్భణ వాతావరణంలో స్థూల ఆర్థిక అంశాలన్నీ ప్రభావితమవుతాయని క్రిప్టో లెండర్ నెక్సో మేనేజింగ్ పార్ట్‌నర్ ఆంటోనీ ట్రెంచెవ్ విశ్లేషించారు.
రెండో అతిపెద్ద టోకెన్ అయిన ఈథర్ రెండు నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇథేరియం బ్లాక్ చైన్‌లో అప్‌గ్రెడేషన్ కారణంగా ఇంధన వినియోగం తగ్గుతుందన్న వార్తల వల్ల వచ్చిన ఊపు నెమ్మదిగా సద్దుమణిగింది.
Ripple Labs Inc సంస్థకు అనుబంధంగా ఉన్న XRP టోకెన్ అత్యధికంగా క్షీణించినవాటిలో ఒకటిగా ఉంది. ఇది 13.5% మేర తగ్గింది. XRP నియంత్రిత భద్రత కాదని క్లెయిమ్ చేయడంలో రిపుల్ "నిర్లక్ష్యం"గా ఉందా లేదా అనే దానిపై కోర్టు కేసులో తక్షణ తీర్పును యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ ఎదురుచూస్తోందన్న వార్తల మధ్య ఈ పతనం చోటు చేసుకుంది.
CoinGecko గణాంకాల ప్రకారం డిజిటల్ టోకెన్‌ల మార్కెట్ విలువ గత 24 గంటల్లో $70 బిలియన్లకు పైగా తగ్గి $941 బిలియన్లకు చేరుకుంది. 2021లో గరిష్టంగా $3 ట్రిలియన్లుగా ఉంది.