Bitcoin | బిట్‌కాయిన్ రికార్డు పతనం
18 June 2022, 23:02 IST
ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్` విలువ రికార్డు స్థాయిలో తగ్గింది. డిసెంబర్ 2020 తరువాత తొలిసారి 19 వేల డాలర్ల దిగువకు చేరింది.
బిట్‌కాయిన్
బిట్ కాయిన్ విలువ ఈ స్థాయికి పతనం కావడానికి క్రిప్టో కరెన్సీ సిస్టమ్‌లో పెరుగుతున్న ఒత్తిడే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
19వేల డాలర్ల దిగువకు..
మార్కెట్ వాల్యూ ప్రకారం క్రిప్టోకరెన్సీల్లో అతిపెద్దది బిట్ కాయిన్. ఈ డిజిటల్ టోకెన్ విలువ శనివారం ఒక్కసారిగా దిగజారింది. 19 వేల డాలర్ల దిగువకు, 18,740 డాలర్లకు చేరింది. ఇది అంతకుముందు రోజు కన్నా 7.46% తక్కువ. గత 12 రోజులుగా బిట్‌కాయిన్ విలువ తగ్గుతూ వస్తోంది. మరో క్రిప్టోకరెన్సీ ఈథర్ వాల్యూ కూడా 1000 డాలర్ల వరకు తగ్గి, ప్రస్తుతం 975 డాలర్ల వద్దకు చేరింది. ఈథర్ విలువ ఈ స్థాయికి చేరడం 2021 జనవరి తరువాత ఇదే ప్రథమం. ఈ రెండు క్రిప్టో కరెన్సీలు గత నవంబర్‌లో ఆల్ టైమ్ హై కి చేరాయి.
క్రిప్టో మార్కెట్లో హెచ్చుతగ్గులు..
ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, క్రిప్టో కరెన్సీ వ్యవస్థలో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు, ఆర్థిక మాంద్యం భయాలు బిట్ కాయిన్ విలువ ఇంతగా పతనం కావడానికి ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. బిట్ కాయిన్ గత 12 ఏళ్లుగా ట్రేడింగ్‌లో ఉంది.
టాపిక్