తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bilkis Bano Case : బిల్కిస్​ బానో కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు- గుజరాత్​ ప్రభుత్వానికి షాక్​!

Bilkis Bano case : బిల్కిస్​ బానో కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు- గుజరాత్​ ప్రభుత్వానికి షాక్​!

Sharath Chitturi HT Telugu

08 January 2024, 11:52 IST

  • Bilkis Bano case : బిల్కిస్​ బానో కేసులో దోషులుగా ఉన్న 11మందిని విడుదల చేయడానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. దోషులు జైలుకు తిరిగివెళ్లాలని తేల్చి చెప్పింది.

బిల్కిస్​ బానో కేసుపై సుప్రీంకోర్టు తీర్పు..
బిల్కిస్​ బానో కేసుపై సుప్రీంకోర్టు తీర్పు..

బిల్కిస్​ బానో కేసుపై సుప్రీంకోర్టు తీర్పు..

Bilkis Bano case Supreme court verdict : బిల్కిస్​ బానో కేసులో 11మంది దోషులను జైలు నుంచి విడుదల చేస్తూ గుజరాత్​ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ చర్యలు చేపట్టే సమర్థత గుజరాత్​ ప్రభుత్వానికి లేదని, ఆ విషయం.. మహారాష్ట్ర చేతుల్లో ఉందని పేర్కొంది. నిందితులకు 2 వారాల సమయాన్ని ఇస్తూ.. ఆలోగా జైలులో లొంగిపోవాలని తీర్పులో స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో.. న్యాయం కోసం పోరాడుతున్న బిల్కిస్​ బానోకు విజయం లభించినట్టు అయ్యింది.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

"వాస్తవాలను తప్పుదో పట్టించి, క్షమాపణల కోసం దోషులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. క్షమాపణ అంగీకరించి, దోషులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఎప్పుడు గుజరాత్​ ప్రభుత్వానికి చెప్పలేదు. ఇది నేరపూరత చర్య. ఈ విషయంలో బాధితురాలి హక్కును పరిగణలోకి తీసుకోవాలి. ఆ మహిళకు గౌరవం ఇవ్వాలి. దోషులను విడుదల చేసే ముందు గుజరాత్​ ప్రభుత్వం.. నాటి తీర్పును వ్యతిరేకిస్తూ రివ్యూ పిటీషన్​ని వేసుండేది. కానీ అలా చేయలేదు. దోషులను విడిచిపెట్టే సమర్థత గుజరాత్​ ప్రభుత్వానికి లేదు," అని బిల్కిస్​ బానో కేసుల తీర్పును వెలువరించిన జస్టిస్​ బీవై నగరత్న, జస్టిస్​ ఉజ్జల్​ భవన్​లతో కూడిన సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఇదీ జరిగింది..

గోద్రా ఘటన నేపథ్యంలో చెలరేగిన అల్లర్ల సమయంలో బిల్కిస్​ బానో వయస్సు 21ఏళ్లు. అప్పటికి ఆమె 5 నెలల గర్భవతి. అల్లర్లలో.. ఏడుగురు కుటుంబసభ్యులను కోల్పోయింది బిల్కిస్​ బానో. వారిలో తన 3ఏళ్ల కుమార్తె కూడా ఉండి. అంతేకాకుండా.. ఆ నాడు, ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది.

Supreme court Bilkis Bano case : బిల్కిస్​ బానో కేసు దర్యాప్తును గుజరాత్​ నుంచి ముంబైకి తరలించారు. కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. 11మంది నిందితులను జీవిత ఖైదు చేయాలని 2008లో తీర్పునిచ్చింది స్పెషల్​ కోర్టు. ప్రత్యేక కోర్టు తీర్పును 2017లో బాంబే హైకోర్టు డివిజన్​ బెంచ్​ సమర్థించింది.

అయితే.. 2022 ఆగస్ట్​ 15న.. 11మంది నిందితులకు ఉపశమనాన్ని కల్పిస్తూ, వారిని జైలు నుంచి విడుదల చేసింది గుజరాత్​ హైకోర్టు. ఆ నిర్ణయాన్ని కేంద్రం కూడా సమర్థించింది! ఈ వ్యవహారంపై బిల్కిస్​ బానో వేసిన పిటిషన్​.. సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. అదే సమయంలో.. మహిళకు మద్దతుగా.. అనేక మంది కూడా పిటిషన్లు దాఖలు చేశారు.

Bilkis Bano case Supreme court : బిల్కిస్​ బానో కేసుపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. దోషులకు ఉపశమనం కల్పించే విషయంలో ప్రభుత్వాలు సెలెక్టివ్​గా (తమకు నచ్చిన వారికే) ఉండకూడదని అభిప్రాయపడింది. అన్నివైపులా వాదనలు విన్న కోర్టు.. అక్టోబర్​ 12న తీర్పును రిజర్వు చేసింది. తాజాగా.. తీర్పును ప్రకటించింది.

తదుపరి వ్యాసం