తెలుగు న్యూస్  /  National International  /  Bhupendra Patel Takes Oath As Gujarat Chief Minister For Second Time Prime Minister Narendra Modi Present

Gujarat CM takes oath: గుజరాత్ సీఎంగా రెండోసారి.. ప్రమాణం చేసిన భూపేంద్ర.. ప్రధాని మోదీ సమక్షంలో..

12 December 2022, 14:45 IST

    • Gujarat CM Bhupendra Patel takes oath: గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అగ్రనాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Gujarat CM takes oath: గుజరాత్ సీఎంగా రెండోసారి.. ప్రమాణం చేసిన భూపేంద్ర (Photo: BJP Gujarat)
Gujarat CM takes oath: గుజరాత్ సీఎంగా రెండోసారి.. ప్రమాణం చేసిన భూపేంద్ర (Photo: BJP Gujarat)

Gujarat CM takes oath: గుజరాత్ సీఎంగా రెండోసారి.. ప్రమాణం చేసిన భూపేంద్ర (Photo: BJP Gujarat)

Gujarat CM Bhupendra Patel takes oath: గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా రెండోసారి సీఎం బాధ్యతలను చేపట్టారు. గాంధీనగర్‌లోని కొత్త సెక్రటేరియట్ హెలీప్యాడ్ గ్రౌండ్‍లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర 18 ముఖ్యమంత్రిగా భూపేంద్రతో గవర్నర్ ఆచార్య దేవ్‍వ్రత్ ప్రమాణం చేయించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు, ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 16 మంది ఎమ్మెల్యేలు ఈ వేదికపైనే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

ప్రముఖుల హాజరు

Gujarat CM Bhupendra Patel takes oath: అమిత్ షా, రాజ్‍నాథ్ సింగ్, స్మృతి ఇరానీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా.. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, మహారాష్ట్ర సీఎం ఏక్‍నాథ్ షిండేతో పాటు మరికొందరు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. వందలాది మంది సాధువులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు.

భూపేంద్ర రెండోసారి..

Gujarat CM Bhupendra Patel takes oath: ప్రభుత్వ వ్యతిరేకత పసిగట్టిన బీజేపీ అధిష్టానం.. గుజరాత్ సీఎంగా ఉన్న విజయ్ రూపానీని గత సంవత్సరం సెప్టెంబర్ లో తప్పించింది. సీఎంగా భూపేంద్ర పటేల్‍ను ఎంపిక చేసింది. అప్పుడే తొలిసారి సీఎం పీఠంపై కూర్చుకున్నారు భూపేంద్ర. ఇప్పుడు రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి.. ఆ పదవిని నిలుపుకున్నారు. ఘట్లోడియా నియోజకవర్గం నుంచి భూపేంద్ర ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

చరిత్ర సృష్టించిన బీజేపీ

Gujarat Assembly election Results: ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‍లో ఈనెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 182 స్థానాలకు గాను 156 సీట్లలో గెలిచి బీజేపీ చరిత్ర సృష్టించింది. రాష్ట్రంలో వరుసగా ఏడోసారి అధికారాన్ని చేపట్టింది. కాంగ్రెస్ మరింత చతికిలపడి 16 స్థానాలకే పరిమితం కాగా.. ఆమ్‍ఆద్మీ 5 సీట్లతో సరిపెట్టుకుంది. కాగా, గుజరాత్‍లో 150కు పైగా సీట్లు ఒకేపార్టీకి రావడం ఇదే తొలిసారి. 1985లో కాంగ్రెస్‍కు 149 వచ్చాయి. ఆ రికార్డును ఈసారి కషాయ పార్టీ బద్దలుకొట్టింది. నరేంద్ర మోదీ సీఎంగా ఉన్న 2012 ఎన్నికల్లోనూ బీజేపీ 127 సీట్లు సాధించింది. కాగా, 27 సంత్సరాల నుంచి గుజరాత్‍లో బీజేపీనే అధికారంలో ఉంది.