HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Dengue Cases : బెంగళూరులో విజృంభిస్తున్న డెంగ్యూ.. మూడు వారాల్లో 1000 కేసులు

Dengue Cases : బెంగళూరులో విజృంభిస్తున్న డెంగ్యూ.. మూడు వారాల్లో 1000 కేసులు

Anand Sai HT Telugu

26 June 2024, 9:53 IST

    • Dengue Cases In Bengaluru : బెంగళూరు మహానగరంలో డెంగ్యూ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. అయినా కూడా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
బెంగళూరు డెంగ్యూ కేసులు
బెంగళూరు డెంగ్యూ కేసులు

బెంగళూరు డెంగ్యూ కేసులు

బెంగళూరులో డెంగ్యూ కేసులు ఇటీవల వెయ్యికి పైగా నమోదయ్యాయి. ఇది గత సంవత్సరంలో ఇదే సమయంతో పోలిస్తే గణనీయమైన పెరుగుదలగా ఉంది. బెంగళూరు నగరంలోని బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) పరిధిలో డెంగ్యూ కేసులు 1,000 దాటాయి. గత మూడు వారాల్లో 1,036 కేసులు నమోదయ్యాయి. ఇది కిందటి ఏడాది జూన్ గణాంకాలతో పోలిస్తే రెండు రెట్లు పెరిగింది.

అంతేకాదు బీబీఎంపీ చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్‌కు సైతం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. స్వల్ప జ్వరంతో శుక్రవారం నుంచి అస్వస్థతకు గురైనప్పటికీ గిరినాథ్ తన విధులను కొనసాగించారని, ఫ్రీడమ్ పార్క్ లో కొత్త మల్టీలెవల్ కార్ పార్క్ ప్రారంభోత్సవాన్ని పర్యవేక్షించడంతో పాటు ముసాయిదా ప్రకటన విధానం సమీక్షలో పాల్గొన్నారు.

వైద్య సలహా మేరకు శనివారం డెంగ్యూ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం గిరినాథ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇంటి నుంచే పనిచేస్తున్నారని, త్వరలోనే కార్యాలయానికి తిరిగి వస్తారని అధికారులు తెలిపారు. మరోవైపు బీబీఎంపీ ఆరోగ్య అధికారులు డెంగ్యూ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు, ఇంటింటి సర్వేలు, దోమల నివారణ చర్యలైన స్ప్రేయింగ్, ఫాగింగ్ వంటి దోమల నియంత్రణ చర్యలపై దృష్టి సారిస్తున్నారు.

గత ఆరు నెలల్లో బెంగళూరులో మొత్తం 2,447 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని, మహదేవపుర, ఈస్ట్ జోన్లలో అధిక జనాభా కారణంగా అత్యధిక కేసులు నమోదయ్యాయని అధికారుల నివేదిక చెబుతుంది.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న డెంగ్యూ కేసులపై సీఎం సిద్ధరామయ్య సమీక్షిస్తున్నారు. వైరల్ సంక్రమణను గుర్తించడం, చికిత్స చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు, ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో చికిత్స, మందులు, బ్లడ్ ప్లేట్లెట్స్ తగినంతగా అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.

నిన్నటి వరకు కర్ణాటకలో 5,374 డెంగ్యూ కేసులు నమోదు కాగా ఐదుగురు మరణించారు. ఇంటింటి సర్వేలు, ఆశావర్కర్లు, నర్సింగ్ విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులతో సమగ్ర అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు ఆరోగ్య శాఖ మంత్రి. ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు ప్రజలతో కలిసి పనిచేయాలని కోరారు.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్