తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ceo Kills Son : కుమారుడిని చంపిన ప్రముఖ స్టార్టప్​ సంస్థ సీఈఓ- శరీరాన్ని బ్యాగ్​లో కుక్కి..!

CEO kills son : కుమారుడిని చంపిన ప్రముఖ స్టార్టప్​ సంస్థ సీఈఓ- శరీరాన్ని బ్యాగ్​లో కుక్కి..!

Sharath Chitturi HT Telugu

09 January 2024, 11:27 IST

    • CEO kills son : బెంగళూరుకు చెందిన ప్రముఖ స్టార్టప్​ సంస్థ మైండ్​ఫుల్​ ఏఐ ల్యాబ్​ సీఈఓ సుచన సేత్​.. తన 4ఏళ్ల బిడ్డను చంపేసింది! పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నం విఫలమైంది.
కుమారుడిని చంపిన ప్రముఖ స్టార్టప్​ సంస్థ సీఈఓ
కుమారుడిని చంపిన ప్రముఖ స్టార్టప్​ సంస్థ సీఈఓ

కుమారుడిని చంపిన ప్రముఖ స్టార్టప్​ సంస్థ సీఈఓ

CEO kills son in Goa : గోవాలో దారుణ ఘటన జరిగింది. బెంగళూరుకు చెందిన ఓ ప్రముఖ స్టార్టప్​ సంస్థ సీఈఓ.. తన బిడ్డను చంపేసింది. ఆమెను పోలీసులు కర్ణాటకలో పట్టుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్

ఇదీ జరిగింది..

బెంగళూరుకు చెందిన మైండ్​ఫుల్​ ఏఐ ల్యాబ్​ అనే ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ స్టార్టప్​ సంస్థకు సీఈఓగా పనిచేస్తున్న సుచన సేత్​.. గత శనివారం, తన చిన్న కుమారుడితో కలిసి గోవాకు వెళ్లింది. అతని వయస్సు 4ఏళ్లు. శనివారం మధ్యాహ్నం సమయంలో.. ఉత్తర గోవా కండోలిమ్​లోని ఓ హోటల్​లో దిగింది. సోమవారం చెక్ఔట్​ చేసింది. చేతిలో ఓ బ్యాగ్​ పట్టుకుని, బెంగళూరుకు ట్యాక్సీని బుక్​ చేయాలని హోటల్​ సిబ్బందికి చెప్పింది. 'బెంగళూరు వరకు ట్యాక్సీ ఆ? ఫ్లైట్​లో వెళ్లండి,' అని హోటల్​ సిబ్బంది సూచించగా.. 'వద్దు. ట్యాక్సీలోనే వెళతాను,' అని ఆమె సమాధానం ఇచ్చింది.

Mindful AI Lab CEO kill son : అదే సమయంలో.. ఆమె పక్కన బాలుడు కనిపించకపోవడాన్ని హోటల్​ సిబ్బంది గమనించారు. ఇంతలో ట్యాక్సీ వచ్చింది. ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొంతసేపటికి.. సుచన సేత్​ ఉన్న రూమ్​లోకి వెళ్లిన హౌజ్​ క్లీనింగ్​ స్టాఫ్​కి.. నేల మీద రక్తపు మరకలు కనిపించాయి. వెంటనే హోటల్​ సిబ్బందిని అలర్ట్​ చేశారు. వారు పోలీసులకు ఫోన్​ చేశారు.

హోటల్​ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో.. పోలీసులు మైండ్​ఫుల్​ ఏఐ ల్యాబ్​ స్టార్టప్​ సంస్థ సీఈఓకు ఫోన్​ చేశారు. బులుడి గురించి ప్రశ్నించారు. "నా బిడ్డ.. తన ఫ్రెండ్​ ఇంటికి వెళ్లాడు," అని ఒక అడ్రెస్​ చెప్పింది. కొంతసేపటికి.. అది ఫేక్​ అడ్రెస్​ అని తెలుసుకున్నారు పోలీసులు. అనంతరం.. సుచన సేత్​​ ఎక్కిన ట్యాక్సీ డ్రైవర్​కి ఫోన్​ చేసి.. ఆమెకు అర్థం కాని కోంకణ్​ భాషలో మాట్లాడారు. ట్యాక్సీని చిత్రదుర్గకు సమీపంలోని పోలీస్​ స్టేషన్​కి తీసుకెళ్లాలని చెప్పారు. పోలీసులు చెప్పినట్టు చేశాడు ఆ ట్యాక్సీ డ్రైవర్​.

Mindful AI Lab CEO Suchana Seth : అనంతరం.. సుచన సేత్​​ని పోలీసులు పట్టుకున్నారు. ఆమె బ్యాగ్​లో బాలుడి మృతదేహం కనిపించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మైండ్​ఫుల్​ ఏఐ ల్యాబ్​ సీఈఓను అరెస్ట్​ చేశారు.

సుచన సేత్​​.. బాలుడిని ఎందుకు చంప్పింది? అన్న ప్రశ్నకు ప్రస్తుతం సమాధానం లేదు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు, త్వరలోనే ఇతర వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు.

ఎవరు ఈ సుచన సేత్​​..?

Suchana Seth kills son : మైండ్​ఫుల్​ ఏఐ ల్యాబ్​ సీఈఓ సుచన సేత్​​.. "2021 టాప్​ 100 బ్రిలియెంట్​ ఉమెన్​ఇన్​ ఏఐ అథిక్స్​"లో ఒకరు. హార్వర్డ్​ యూనివర్సిటీకి చెందిన బెర్క్​మన్​ క్లెయిన్​ సెంటర్​లో చదువుకున్నట్టు సుచిత సేత్​ లింక్​డ్​ఇన్​ బయో సూచిస్తోంది. ఆమె ఒక డేటా సైంటిస్ట్​. డేటా సైన్స్​ టీమ్​ మానిటరింగ్​లో ఆమెకు 12ఏళ్ల అనుభవం ఉంది.

తదుపరి వ్యాసం