Salman Khan: ట్యాక్సీ డ్రైవర్‌కు డబ్బు ఎగ్గొట్టిన సల్మాన్.. ఫన్నీ మెమొరీ షేర్ చేసిన భాయ్‌జాన్-salman khan says he ditched taxi driver before he was famous ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salman Khan: ట్యాక్సీ డ్రైవర్‌కు డబ్బు ఎగ్గొట్టిన సల్మాన్.. ఫన్నీ మెమొరీ షేర్ చేసిన భాయ్‌జాన్

Salman Khan: ట్యాక్సీ డ్రైవర్‌కు డబ్బు ఎగ్గొట్టిన సల్మాన్.. ఫన్నీ మెమొరీ షేర్ చేసిన భాయ్‌జాన్

Maragani Govardhan HT Telugu
Apr 15, 2023 06:50 PM IST

Salman Khan: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన జీవితంలో జరిగిన ఓ ఫన్నీ సంఘటనను తెలియజేశాడు. తన కాలేజీ రోజుల్లో ఓ ట్యాక్సీ డ్రైవర్‌కు డబ్బు ఎగ్గొట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత అతడికి వడ్డీతో సహా ఇచ్చేశానని తెలిపాడు.

సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ (Girish Srivastav)

Salman Khan: సినిమాల్లో అవకాశాలు అంత సులభంగా రావని అందరికీ తెలిసిన విషయమే. హార్డ్ వర్క్‌తో పాటు అదృష్టం కూడా బాగా కలిసి వస్తేనే వెండితెర కల నెరవేరుతుంది. ఇప్పుడున్న స్టార్ హీరోల్లో చాలా మంది ఇలాంటి కష్టాలు అనుభవించి వచ్చినవాళ్లే. కొన్నిసార్లు చిత్రసీమలో బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లు సైతం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న దాఖలాలు ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఉన్నాడు. తండ్రి సలీమ్ హిందీ చిత్రసీమలో గుర్తింపున్న రచయిత అయినప్పటికీ తను కాలేజ్‌లో చదివే రోజుల్లో క్యాబ్ ఛార్జిలు చెల్లించడానికి కూడా డబ్బులు ఉండేవి కాదట. ఈ విషయాన్ని సల్మాన్ ఖానే స్వయంగా తెలియజేశాడు.

బాలీవుడ్‌‍లో సలీమ్-జావేద్ రచయితల ద్వయం ఎంతో ఫేమస్. వీరిద్దరి కథను అందించిన చాలా సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. అయితే జావేద్ నుంచి సలీమ్ విడిపోయిన తర్వాత సోలో రైటర్‌గా అవకాశాల కోసం ఆయన ప్రయత్నించారు. ఆ సమయంలో ఆయన సంపాదన తక్కువ ఉండటంతో సల్మాన్ కుటుంబం కొంతకాలం ఇబ్బంది పడిందట. ముఖ్యంగా సల్మాన్ కాలేజీలో చదివే రోజుల్లో క్యాబ్ ఫీజు చెల్లించడానికి కూడా డబ్బులు ఉండేవి కాదట. ఈ విషయాన్ని సల్మాన్ తెలియజేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు తన గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

"మేము సాధారణంగా కాలేజీకి ట్రైన్‌లో వెళ్లేవాళ్లం. కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితిలో క్యాబ్‌ను తీసుకునేవాళ్లం. ఒకరోజు అలాగే ట్యాక్సీలో వెళ్లాలని అనుకున్నా. కానీ నా వద్ద డబ్బు లేకపోవడం విశేషం. నేను డ్రైవర్‌ను మా కాలేజ్ దగ్గర ఆపి.. లోపలకు వెళ్లి డబ్బు తీసుకొస్తానని చెప్పి.. తిరిగి వెళ్లలేదు." అని సల్మాన్ ఖాన్ వివరించాడు.

మోడలింగ్‌లో అడుగుపెట్టిన తర్వాత తను డబ్బులు ఎగ్గొట్టిన క్యాబ్ డ్రైవర్‌కు వడ్డీతో సహా ఇచ్చానని సల్మాన్ తెలిపాడు. "కొన్ని రోజులకు మోడలింగ్‌లో అడుగుపెట్టిన నేను నిదానంగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాను. అలాగే ఒకసారి ట్యాక్సీలో ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఆ ట్యాక్సీ డ్రైవర్ నన్నెక్కడో చూశానని ప్రయాణం చేసినంత సేపు చెబుతూనే ఉన్నాడు. మా ఇంటి వద్దకు చేరిన తర్వాత నేను పైకి వెళ్లి డబ్బు తీసుకొస్తాను.. అంతవరకు ఇక్కడే ఉండమని చెప్పాను. అప్పుడు వెంటనే అతడు నన్ను గుర్తుపట్టాడు. ఇద్దరం గతంలో జరిగిన సంఘటన తలచుకుని పగలబడి నవ్వుకున్నాం. కానీ ఆ తర్వాత నేను అతడికి వడ్డీతో కలిపి ట్యాక్సీ డబ్బును చెల్లించాను." అని సల్మాన్ తన జీవితంలో జరిగిన ఫన్నీ సంఘటనను గుర్తు చేసుకున్నాడు.

సల్మాన్ ఖాన్ 2009 నుంచి రంజాన్ కానుకగా తన సినిమాలను విడుదల చేయడం సెంటిమెంటుగా పెట్టుకున్నాడు. వాంటెడ్ నుంచి త్వరలో విడుదల కానున్న కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రం వరకు చాలా సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి. కిసీ కా భాయ్ కిసీ కా జాన్ ఏప్రిల్ 21న ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. వెంకటేష్, భూమికా చావ్లా తదితరులు కీలక పాత్రలు పోషించారు.

IPL_Entry_Point

టాపిక్