DimeADozen : రూ. 1.2కోట్లకు అమ్మడుపోయిన రూ. 15వేల స్టార్టప్..!
DimeADozen : రూ. 15వేలతో మొదలైన ఓ స్టార్టప్.. ఏకంగా రూ. 1.2కోట్లకు అమ్ముడుపోయింది! ఫలితంగా స్టార్టప్ ఫౌండర్స్కి భారీ లాభాలు వచ్చాయి.
DimeADozen : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించుకుని.. ఇద్దరు స్నేహితులు అద్భుతాన్ని చేశారు! రూ. 15వేలకు ఓ స్టార్టప్‌ను సృష్టించి.. దానిని ఏకంగా రూ. 1.2కోట్లక విక్రయించి, భారీ లాభాలను వెనకేసుకున్నారు. అసలు కథలోకి వెళితే..
చాట్ జీపీటీని ఉపయోగించుకుని..
సాల్వెటార్ ఐఎల్లోకు ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 17ఏళ్ల అనుభవం ఉంది. దశాబ్ద కాలం పాటు ఆయన స్టార్టప్ ఫండర్గాను, సీటీఓగాను పనిచేశారు. మరోవైపు మానిక పవర్స్.. 15ఏళ్ల పాటు అనేక రంగాల్లో సక్సెస్ సాధించారు. ప్రారంభ దశలో ఉన్న అనేక సంస్థలను శిఖరానికి తీసుకెళ్లారు.
ఈ ఇద్దరు స్నేహితులు సృష్టించిందే ఈ 'డైమ్ఏడజన్'. ఇదొక ఏఐ-పవర్డ్ టూల్. చాట్‌జీపీటీ నుంచి ఇది పుట్టుకొచ్చింది! బిజినెస్ ఐడియాలను తీసుకుని డీటైల్డ్‌గా నివేదికలు రూపొందించడం ఈ టూల్ పని. ఒక బిజినెస్‌లో ఎలాంటి వారు ఇన్వెస్ట్ చేస్తారు? ఎవరు కస్టమర్లుగా ఉంటారు? ఎవరి నుంచి పోటీ ఎదురవుతుంది? వంటి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.
DimeADozen news : ఐఎల్లో, మానిక పవర్స్.. ఓ రోజు చాట్‌జీపీటీ వాడుతుండగా ఈ ఆలోచన పుట్టుకొచ్చింది. బిజినెస్ ఐడియాలను సింప్లిఫై చేసేందుకు ఎదైనా టూల్‌ని కనుక్కోవాలని వారు భావించారు. అలా.. డైమ్ఎడజన్ ఆవిర్భవించింది. ఓ ఫార్మ్‌లో ప్రజలు తమ ఐడియాలను షేర్ చస్తే.. స్మార్ట్ మాథ్ను ఉపయోగించి, ఈ టూల్.. కొన్ని రిపోర్టులను తయారు చేస్తుంది. ఇందులో సమగ్ర సమాచారం ఉంటుంది.
ఇలా కేవలం 185 డాలర్లతో (సుమారు రూ. 15వేలు) ఈ డైమ్ఎడజన్ స్టార్టప్‌ను స్థాపించారు ఇద్దరు స్నేహితులు. ఇది అంచెలంచెలుగా ఎదిగింది. ప్రక్రియ సింపుల్‌గా, ఫాస్ట్‌గా ఉండటంతో.. వెంటనే మంచి పేరు తెచ్చుకుంది. 'వ్యాపార రంగంలో ఎదైనా సమాచారం తెలుసుకోవాలంటే..డైమ్ఎడజన్ వాడాల్సిందే..' అనే రేంజ్‌కు ఎదిగింది. 7 నెలల్లోనే వీరు 66వేల డాలర్లు సంపాదించారు.
ChatGPT latest news : ఒక కంపెనీ ఇంత వేగంగా వృద్ధి చెందుతుంటే పెట్టుబడులు రావడం సహజం. కానీ ఇక్కడ ఈ ఇద్దరి జీవితాలు పూర్తిగా మారిపోయింది! ఫెలిపె అరోసెమెన, డానెల్లె డే కార్నిలియా దంపతులు.. ఈ స్టార్టప్‌ను 1,50,000 డాలర్లకు కొనుగోలు చేశారు. ఇండియన్ కరెన్సీలో ఇది రూ. 1.2కోట్ల కన్నా ఎక్కువే! కంపెనీని అమ్మేసినప్పటికీ.. మానిక, ఐఎల్లోలు దానికి సలహదారులుగా కొనసాగనున్నారు.
సంబంధిత కథనం