తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bel Recruitment 2023: బీఈఎల్ లో ప్రొబేషనరీ ఇంజనీర్ పోస్ట్ ల రిక్రూట్మెంట్

BEL Recruitment 2023: బీఈఎల్ లో ప్రొబేషనరీ ఇంజనీర్ పోస్ట్ ల రిక్రూట్మెంట్

HT Telugu Desk HT Telugu

06 October 2023, 14:52 IST

google News
    • BEL Recruitment 2023: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (Bharat Electronics Limited, BEL) లో ప్రొబేషనరీ ఇంజనీర్ పోస్ట్ లతో పాటు పలు ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 232 పోస్ట్ లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

BEL Recruitment 2023: ప్రొబేషనరీ ఇంజనీర్, పలు ఇతర పోస్టుల కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు బీఈఎల్ అధికారిక వెబ్ సైట్ bel-india.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 232 పోస్టులను భర్తీ చేయనున్నారు.

లాస్ట్ డేట్, వేకెన్సీ వివరాలు..

ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 28, 2023. కాగా, ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఈ పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు.

  • ప్రొబేషనరీ ఇంజనీర్: 205 పోస్టులు
  • ప్రొబేషనరీ ఆఫీసర్: 12 పోస్టులు
  • ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్: 15 పోస్టులు

అర్హతలు, ఇతర వివరాలు..

  • ప్రొబేషనరీ ఇంజనీర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబందిత విభాగంలో B.E / B.Tech చేసి ఉండాలి.
  • ప్రొబేషనరీ ఆఫీసర్: రెండేళ్ల MBA/MSW/PG డిగ్రీ. లేదా హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్ మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్స్/పర్సనల్ మేనేజ్ మెంట్ లో PG డిప్లొమా.
  • ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్: CA/CMA ఫైనల్

వయో పరిమితి

ప్రొబేషనరీ ఇంజనీర్ మరియు ప్రొబేషనరీ ఆఫీసర్ (HR) పోస్టులకు అన్‌రిజర్వ్‌డ్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలు కాగా, ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్ లకు 30 సంవత్సరాలు.

అప్లికేషన్ ఫీజు..

జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీల అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. పూర్తి వివరాల కోసం బీఈఎల్ అధికారిక వెబ్ సైట్ bel-india.in ను పరిశీలించండి.

తదుపరి వ్యాసం