తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bank Of Maharashtra Recruitment 2023: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్: వివరాలివే

Bank of Maharashtra Recruitment 2023: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్: వివరాలివే

25 January 2023, 10:44 IST

google News
    • Bank of Maharashtra Recruitment 2023: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 225 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు తేదీలు, అప్లికేషన్ విధానంతో పాటు మరిన్ని వివరాలివే..
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో స్పెషల్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్: పూర్తి వివరాలివే
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో స్పెషల్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్: పూర్తి వివరాలివే

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో స్పెషల్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్: పూర్తి వివరాలివే

Bank of Maharashtra Recruitment 2023: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (SO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. విభిన్న విభాగాల్లో 225 ఎస్‍వో స్కేల్ 2, గ్రేడ్ 3 ఖాళీల కోసం ఆ బ్యాంక్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఫిబ్రవరి 6వ తేదీలోగా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఎలా చేసుకోవాలి, ఫీజ్ తదితర ఇక్కడ తెలుసుకోండి.

Bank of Maharashtra Recruitment 2023: ముఖ్యమైన తేదీలు

ఆన్‍లైన్ దరఖాస్తులు ప్రారంభం: 23-01-2023

దరఖాస్తుకు చివరి తేదీ: 06-02-2023

ఆన్‍లైన్ ఫీజు పేమెంట్ తుది గడువు: 06-02-2023

అప్లికేషన్ ప్రింటింగ్ లాస్ట్ డేట్: 21-02-2023

Bank of Maharashtra Recruitment 2023: అప్లికేషన్ ఫీజు

అన్‍రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.1,000గా ఉంది. ఎస్‍సీ, ఎస్‍టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు రూ.100.

వయో పరిమితి: 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎస్‍సీ, ఎస్‍టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది. నిబంధనల ప్రకారం మరికొన్ని కేటగిరీలకు సడలింపులు ఉన్నాయి.

Bank of Maharashtra Recruitment 2023: ఎలా దరఖాస్తు చేయాలంటే..

  • ముందుగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వెబ్‍సైట్ bankofmaharashtra.in కు వెళ్లాలి.
  • కెరీర్ ట్యాబ్‍లో రిక్రూట్‍మెంట్ ప్రాసెస్ ఆప్షన్‍పై క్లిక్ చేయాలి.
  • అనంతరం కరెంట్ ఓపెనింగ్స్ ఆప్షన్‍పై క్లిక్ చేయాలి. అక్కడ రిక్రూట్‍మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ లింక్ కనిపిస్తుంది.
  • అక్కడ రిజిస్ట్రేషన్ లింక్‍పై క్లిక్ చేయాలి.
  • అనంతరం రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని.. దరఖాస్తు కోసం వివరాలు నమోదు చేయాలి.
  • అనంతరం ఫీజు చెల్లిస్తే దరఖాస్తు పూర్తవుతుంది.
  • చివరగా, అప్లికేషన్‍ను ప్రింటవుట్ తీసుకోండి.

దరఖాస్తు చేసే పోస్టును బట్టి ఆ విభాగంలో అభ్యర్థులు గ్రూడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కొన్ని పోస్టులకు అనుభవం కూడా ఉండాలి.

తదుపరి వ్యాసం