Bank of Maharashtra : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఆఫీసర్ పోస్టులు- పూర్తి వివరాలు..
12 July 2024, 6:02 IST
- Bank of Maharashtra Recruitment 2024 : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్లు, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌లోని పూర్తి వివరాలను అభ్యర్థులు ఇక్కడ వివరాలు తెలుసుకోవచ్చు.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రిక్రూట్మెంట్
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తోంది. అర్హులైన అభ్యర్థులు bankofmaharashtra.in బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 10న ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 జూలై 26న ముగియనుందని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి.
ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలోని ఆఫీసర్ సహా మొత్తం 195 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
అర్హత వివరాలు..
పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఎంపిక ప్రక్రియ..
పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ/డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థి అర్హతలు, అనుకూలత/అనుభవం మొదలైన వాటికి సంబంధించి అర్హులైన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడానికి బ్యాంకు దరఖాస్తుల ప్రాథమిక స్క్రీనింగ్ నిర్వహించవచ్చు. పర్సనల్ ఇంటర్వ్యూ/డిస్కషన్స్‌లో అభ్యర్థి సాధించిన మార్కుల ఆధారంగా తుది సెలక్షన్ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూలకు మార్కుల కేటాయింపు 100. ఇంటర్వ్యూకు అర్హత సాధించడానికి అభ్యర్థి కనీసం 50 మార్కులు (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగుల విషయంలో 45) సాధించాలి.
దరఖాస్తు ఫీజు..
యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ. 1000+180 జీఎస్టీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 100+18 జీఎస్టీ. పుణెలో చెల్లించాల్సిన "బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ ప్రాజెక్ట్ 2024-25" పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో డ్రా చేసిన డిమాండ్ డ్రాఫ్ట్ (నాన్-రిఫండబుల్) ద్వారా చెల్లించాలి. మరే ఇతర చెల్లింపు విధానం ఆమోదయోగ్యం కాదు.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తును ఇతర అవసరమైన వివరాలతో సహా జనరల్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, హెచ్ఆర్ఎం డిపార్ట్మెంట్కు పంపవచ్చు. ప్రధాన కార్యాలయం, "లోక్ మంగళ్", 1501, శివాజీనగర్, పూణే 411 005.
ఒకసారి సమర్పించిన దరఖాస్తులను ఉపసంహరించుకోవడానికి అనుమతించరు. ఒకసారి చెల్లించిన రుసుము తిరిగి ఇవ్వడం కుదరదు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారిక వెబ్‌సైట్‌ని చూడవచ్చు.
ఇండియన్ బ్యాంక్ లో భారీ రిక్రూట్మెంట్..
ఇండియన్ బ్యాంక్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ indianbank.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 1500 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇండియన్ బ్యాంక్ లొ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 జూలై 10న ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికిి ఆఖరు తేదీ 2024 జూలై 31.
ఇండియన్ బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తత్సమాన విద్యార్హతలు కలిగి ఉండాలి. అభ్యర్థులు 31.03.2020 తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.