తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bank Holidays : ఈ వారం బ్యాంకు సెలవుల వివరాలు..

Bank holidays : ఈ వారం బ్యాంకు సెలవుల వివరాలు..

Sharath Chitturi HT Telugu

16 August 2022, 7:30 IST

    • Bank holidays : ఈ వారంలో అనేక ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఆ వివరాలు..
ఈ వారం బ్యాంకు సెలవుల వివరాలు
ఈ వారం బ్యాంకు సెలవుల వివరాలు (Mint)

ఈ వారం బ్యాంకు సెలవుల వివరాలు

Bank holidays : గత వారం.. బ్యాంకులకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు వచ్చాయి. ఇక స్వాతంత్ర్య దినోత్సవం కారణంగా సోమవారం కూడా దేశవ్యాప్తంగా బ్యాంకులు సెలవు తీసుకున్నాయి. అంటే ఈ వారం.. బ్యాంకులు సెలవుతోనే మొదలుపెట్టినట్టు. ఇదే కాకుండా.. ఈ వారం బ్యాంకులకు మరిన్ని సెలవులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మంగళవారం కూడా బ్యాంకులకు సెలవుగానే ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్

బ్యాంకు సెలవుల వివరాలు..

మంగళవారం:- పార్సి న్యూ ఇయర్​ (షెహెన్​షాహి)- బేలాపూర్​, ముంబై, నాగ్​పూర్​లలో బ్యాంకులకు సెలవు.

గురువారం/ శుక్రవారం:- శ్రీ కృష్ణుడి జన్మాష్టమిని కొన్ని ప్రాంతాల్లో గురువారం, మరికొన్ని ప్రాంతాల్లో శుక్రవారం, శనివారాలు జరుపుకుంటున్నారు. ఫలితంగా ఆయా రోజుల్లో వివిధ ప్రాంతాల్లోని బ్యాంకులు సెలవు తీసుకుంటున్నాయి.

Bank holidays this week : గురువారం.. అంటే 18వ తేదీన.. భువనేశ్వర్​, డెహ్రాడూన్​, కాన్పూర్​, లక్నోల్లోని బ్యాంకులకు సెలవు.

ఇక శుక్రవారం.. అంటే 19వ తేదీన.. అహ్మదాబాద్​, భోపాల్​, చంఢీగఢ్​, చెన్నై, గ్యాంగ్​టక్​, జైపూర్​, జమ్ము, పట్నా, రాయ్​పూర్​, రాంచి, షిల్లాంగ్​, షిమ్లాల్లోని బ్యాంకులకు సెలవు.

కాగా.. శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శనివారం హైదరాబాద్​లోని బ్యాంకులకు సెలవు.

ఇక ఆగస్టు 21 ఆదివారం రావడంతో.. ఆ రోజు దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

ఈ నెలలో ఇతర బ్యాంకు సెలవులు..

Bank holidays in august : ఈ నెల మొత్తం మీద బ్యాంకులు 18 రోజుల పాటు మూతపడే ఉంటాయి.

29న.. శ్రీమంత శంకరదేవుని తిథి కారణంతో గౌహతీలో బ్యాంకులకు సెలవు.

31న.. వినాయక చవితి సందర్భంగా.. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు.

ఇక ఆదివారాలు, రెండు- చివరి శనివారాలు బ్యాంకులకు సాధారణ సెలవులే.

తదుపరి వ్యాసం