తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bank Holidays: ఈ వారం బ్యాంకులకు ఎన్నిరోజులు సెలవులు అంటే?

Bank Holidays: ఈ వారం బ్యాంకులకు ఎన్నిరోజులు సెలవులు అంటే?

HT Telugu Desk HT Telugu

08 August 2022, 22:56 IST

    • బ్యాంకులకు వెళ్లే పని ఉందా? అయితే ఈ వారం కష్టమే. ఎందుకంటే బ్యాంకులకు ఈ వారం ఎక్కువగా సెలవులు ఉన్నాయి. ఆన్ లైన్ లో పనులు పూర్తి చేసుకుంటే మంచిది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బ్యాంకు పని ఉంటే.. ఈ వారం వాయిదా వేసుకోవడమే బెటర్. అర్జంట్ అయితే ఆన్ లైన్ లో పూర్తి చేసుకోండి. ఎందుకు ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం.. ఈ వారంలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఒకవేళ వెళ్లాలి.. తప్పదు అని అనుకుంటే మాత్రం.. ఏ రోజున నడుస్తుందో చూసుకోండి. అప్పుడు వెళ్లినా.. రద్దీ ఉండే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు

TS Govt Jobs 2024 : ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు... రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినెట్ ఖాళీలు, ముఖ్య తేదీలివే

TS EAPCET 2024 Results : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయ్ - ఈ డైరెక్ట్ లింక్ తో మీ ర్యాంక్ చెక్ చేసుకోండి

18 May 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

Madhapur Car Accident : మాదాపూర్‎లో కారు బీభత్సం... ఒకరి దుర్మరణం

మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం బ్యాంకులకు సీరియల్ గా సెలవులు ఉన్నాయి. ఆగస్టు 8, 9, 11, 12, 13, 14 తేదీల్లో బ్యాంకులు క్లోజ్ ఉంటాయన్నమాట. రక్షా బంధన్, మొహర్రం పండుగలు వస్తున్నాయి. దీనికితోడు శని, ఆదివారాలు కూడా ఇందులోనే కలిసి వచ్చాయి. ఈ కారణంగా.. వారంలో ఆరు రోజుల పాటు బ్యాంకులు మూసేసి ఉంటాయి. బుధవారం మాత్రం బ్యాంకులు తెరిచి ఉంటాయి. అర్జంట్ పని ఉన్నవారు.. ఆ రోజున వెళ్లి రావొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలో బ్యాంకులకు 10 రోజులు సెలవులు ఉన్నాయి. ఇక ఈ వారంలో ఆగస్టు 9-మొహర్రం, ఆగస్టు-11 రాఖీ పౌర్ణమి, ఆగస్టు 13-రెండో శనివారం, ఆగస్టు 14- ఆదివారం ఉన్నాయి.

హైదరాబాద్, అగర్తల, అహ్మదాబాద్, ఐజ్వాల్, బెలాపూర్, బెంగళూరు, భోపాల్, జైపూర్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచి ప్రాంతాలలో మొహర్రం సందర్భంగా మంగళవారం బ్యాంకులకు సెలవుగా ఉంది. ఆగస్టు 11న రక్షా బంధన్ ఉంది. ఈ సందర్భంగా అహ్మదాబాద్, భోపాల్, డెహ్రడూన్, జైపూర్, సిమ్లాలో బ్యాంకులు క్లోజ్ చేసే ఉంటాయి. కాన్పూర్, లక్నో ప్రాంతాల్లో రక్షా బంధన్ పురస్కరించుకుని.. ఆగస్టు 12న బ్యాంకులు సెలవు.

ఇక ఆగస్టు 13, 14 తేదీల్లో రెండో శనివారం, ఆదివారం కలిసి వచ్చాయి. ఇలా చూసుకుంటే వారంలో ఆరు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఆ తర్వాతి రోజున అంటే... సోమవారం ఆగస్టు 15. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

తదుపరి వ్యాసం