తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Fd Rates: ఫిక్స్‌డ్ డిపాజిటర్లకు శుభవార్త.. బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డీ రేట్ల పెంపు

FD rates: ఫిక్స్‌డ్ డిపాజిటర్లకు శుభవార్త.. బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డీ రేట్ల పెంపు

HT Telugu Desk HT Telugu

05 July 2022, 13:33 IST

google News
  • Bajaj Finance FD rates: బజాజ్ ఫైనాన్స్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. పెరిగిన వడ్డీ రేట్లు జూలై 1 నుంచి వర్తిస్తాయని వెల్లడించింది.

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచిన బజాజ్ ఫైనాన్స్
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచిన బజాజ్ ఫైనాన్స్ (REUTERS)

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచిన బజాజ్ ఫైనాన్స్

Bajaj Finance FD rates: ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో మనం కష్టించి సంపాదించిన డబ్బులను కాపాడుకోవడంతో పాటు అధిక రాబడుల కోసం చక్కని ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ ఉపయోగపడుతుంది. ఇన్వెస్టర్లు వారి రిస్క్ సామర్థ్యం, ఆర్థిక లక్ష్యాలు, రిటర్నులను దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.

చాలా మంది సర్వసాధారణంగా పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ ఫిక్స్‌డ్ డిపాజిట్. ఇది మార్కెట్ హెచ్చుతగ్గులకు ప్రభావం చెందదు. పైగా ఇది సురక్షితమైన పెట్టుబడి సాధనంగా నిలుస్తుంది. బ్యాంకులు, పోస్టాఫీసులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను స్వీకరిస్తాయి.

నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు మిగతవాటికి భిన్నమైన ప్రయోజనాలు అందిస్తాయి. ఈ కోవలో బజాజ్ ఫైనాన్స్ అధిక ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తోంది. దీని ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడులపై మంచి రాబడులను ఆర్జించవచ్చని చెబుతోంది.

బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఐసీఆర్ఏ ఏఏఏ (స్టేబుల్) ర్యాంకింగ్ కలిగి ఉన్నాయి. అంటే అత్యధిక స్థాయి రక్షణ, తక్కువ రిస్క్ కలిగిన పెట్టుబడి అని ఈ రేటింగ్ సూచిస్తోంది.

Bajaj Finance Fixed Deposit ప్రత్యేకతలు:

బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వార్షిక వడ్డీ రేటు 7.75 శాతం చెల్లిస్తుంది. రూ. 15 వేల నుంచి పెట్టుబడులు పెట్టొచ్చు. అధిక రాబడుల కోసం ఫ్లెక్సిబుల్ కాల వ్యవధులను ఎంచుకోవచ్చు. రెగ్యులర్‌గా ఆదాయం పొందవచ్చు. సీనియర్ సిటిజన్లయితే అదనంగా 0.25 శాతం వడ్డీ రేటు పొందవచ్చు.

సిస్టమాటిక్ డిపాజిట్ ప్లాన్ (ఎస్‌డీపీ) ద్వారా కూడా క్రమానుగత పెట్టుబడులు పెట్టొచ్చని, నెలవారీ పొదుపు పథకంలాగా పనిచేస్తుందని తెలిపింది. నెలకు రూ. 5 వేల నుంచి సేవింగ్స్ చేయొచ్చని తెలిపింది. 60 ఏళ్లో లోపు 7.50 శాతం వరకు వడ్డీ రేటు పొందవచ్చని, సీనియర్ సిటిజన్ అయితే 7.75 శాతం వరకు వడ్డీ రేటు పొందవచ్చని తెలిపింది.

తదుపరి వ్యాసం