తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bajaj Auto Shares : 2 శాతం తగ్గిన బజాజ్ ఆటో నికర లాభం.. నష్టపోయిన స్టాక్

Bajaj Auto shares : 2 శాతం తగ్గిన బజాజ్ ఆటో నికర లాభం.. నష్టపోయిన స్టాక్

HT Telugu Desk HT Telugu

28 April 2022, 17:40 IST

google News
    • న్యూఢిల్లీ: మార్చి 2022తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 2 శాతం తగ్గడంతో బజాజ్ ఆటో షేర్లు గురువారం దాదాపు 2 శాతం పడిపోయాయి.
నాలుగో త్రైమాసికంలో తగ్గిన బజాజ్ ఆటో నికర లాభం
నాలుగో త్రైమాసికంలో తగ్గిన బజాజ్ ఆటో నికర లాభం (bajaj auto)

నాలుగో త్రైమాసికంలో తగ్గిన బజాజ్ ఆటో నికర లాభం

బిఎస్‌ఇలో బజాజ్ ఆటో స్టాక్ 2.58 శాతం క్షీణించి రూ. 3,804.80కి చేరుకుంది. చివరకు 1.85 శాతం తగ్గి రూ. 3,833.50 వద్ద ముగిసింది.

ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు ఇంట్రా డేలో 2.57 శాతం క్షీణించి రూ. 3,805 వద్ద స్థిరపడింది. తర్వాత 1.97 శాతం తగ్గి రూ. 3,828.70 వద్ద స్థిరపడింది.

బిఎస్‌ఇలో కంపెనీ మార్కెట్ విలువ రూ. 2,096.15 కోట్లు తగ్గి రూ. 1,10,928.85 కోట్లకు పడిపోయింది.

బలహీనమైన డిమాండ్, సెమీకండక్టర్ కొరత కారణంగా దేశీయ అమ్మకాలు, ఎగుమతి మార్కెట్‌లలో అమ్మకాలు దెబ్బతిన్నందున, మార్చి 2022తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో బజాజ్ ఆటో ఏకీకృత నికర లాభంలో 2 శాతం తగ్గి రూ. 1,526 కోట్లకు పరిమితమైనట్టుగా కంపెనీ బుధవారం నివేదించింది.

పూణేకు చెందిన ఈ కంపెనీ 2020-21 జనవరి-మార్చి త్రైమాసికంలో రూ. 1,551 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది.

టాపిక్

తదుపరి వ్యాసం