తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Badrinath Temple: తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ తలుపులు: వీడియో

Badrinath Temple: తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ తలుపులు: వీడియో

27 April 2023, 8:34 IST

google News
    • Badrinath Temple: బద్రీనాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది.
Badrinath Temple: తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ తలుపులు (ANI Photo)
Badrinath Temple: తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ తలుపులు (ANI Photo)

Badrinath Temple: తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ తలుపులు (ANI Photo)

Badrinath Temple: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ఆలయ (Badrinath Dham) తలుపులు భక్తుల దర్శనం కోసం తెరుచుకున్నాయి. శీతాకాలం కారణంగా గత నవంబర్‌లో ఆలయాన్ని మూసివేయగా.. ఆరు నెలల తర్వాత నేడు తలుపులు తెరుచుకున్నాయి. ఉత్తరాఖండ్‍లోని చమోలీ జిల్లాలో అలకనంద నదీ తీరంలో ఉన్న ఈ ఆలయం.. చార్‌ధామ్‍(Char Dham)లోని ఓ ప్రసిద్ధ క్షేత్రంగా ఉంది. ఈ ఏడాది నవంబర్ వరకు ఈ ఆలయాన్ని భక్తులు దర్శించుకోవచ్చు.

15 క్వింటాళ్ల పూలతో అలంకరణ

Badrinath Temple: తలుపులు తెరుచుకునే అద్భుత ఘట్టం కోసం బద్రీనాథ్ ఆలయాన్ని నిర్వాహకులు 15 క్వింటాళ్ల పూలతో సుందరంగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలు, డప్పు వాయిద్యాల మధ్య బద్రీనాథ్ ఆలయం తలుపులను గురువారం ఉదయం 7.10 గంటలకు ఆలయ అర్చకులు, నిర్వాహకులు తెరిచారు. ఈ దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించారు. జై బద్రీ విశాల్ అంటూ నినాదాలు చేశారు. విష్ణువు ఈ ఆలయంలో బద్రీనాథుడిగా కొలువై ఉన్నారు.

కాగా, రెండు రోజుల క్రితమే కేదార్‍నాథ్ ఆలయ (Kedarnath Temple) తలుపులు కూడా భక్తుల దర్శనం కోసం తెరుచుకున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరు మీద ఆ ఆలయంలో తొలి పూజ జరిగింది. భక్తులు చార్‌ధామ్ యాత్రను సులువుగా, సురక్షితంగా చేసుకునేందుకు సాధ్యమైన అన్ని చర్యలు చేపడుతున్నామని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, ఈసారి రవాణా ఏర్పాట్లను ముందుగానే చేశామని చెప్పారు.

Char Dham Yatra: వాతావరణ పరిస్థితుల కారణంగా చార్‌ధామ్ క్షేత్రాలైన గంగోత్రి, కేదార్‍నాథ్, యమునోత్రి, బద్రీనాథ్ ఆలయాలు.. ప్రతీ ఏడాది అక్టోబర్ - నవంబర్ మధ్య మూతపడతాయి. మళ్లీ ఏప్రిల్ - మే నెలల మధ్య భక్తుల దర్శనం కోసం తెరుచుకుంటాయి. అంటే ప్రతీ ఏడాది సుమారు ఆరు నెలలు పాటు భక్తులు ఈ ఆలయాలను దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఈ నాలుగు ఆలయాలను దర్శించుకునే చార్‌ధామ్ యాత్రను అత్యంత పుణ్యకార్యంగా భక్తులు నమ్ముతారు. ప్రతీ ఏడాది భారీ సంఖ్యలో భక్తులు చార్‌ధామ్ యాత్ర చేస్తారు.

తదుపరి వ్యాసం